హోమ్ /వార్తలు /క్రైమ్ /

Arvind Kejriwal: సిద్ధూ మూసేవాలా దారుణ హత్య.. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు..

Arvind Kejriwal: సిద్ధూ మూసేవాలా దారుణ హత్య.. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు..

మీడియా సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్

మీడియా సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్

Delhi: పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా ను దుండగుడు ఆదివారం.. దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు.

కాంగ్రెస్ నేత, పంజాబ్ ఫేమస్ గాయకుడు సిద్ధూ మూసే వాలాను (Sidhu Moose Wala) ఆదివారం దుండగుడు గన్ తో కాల్చి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal )  స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. సిద్ధూ మూస్ వాలా హత్యపై తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. ఘటన వెనకాల ఎవరున్నప్పటికి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులను వీలైనంతా తొందరగా పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని కేజ్రీవాల్ ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ, “సిద్ధు మూసేవాలా హత్య చాలా బాధాకరం, దిగ్భ్రాంతికరమని అన్నారు.


పంజాబ్ (punjab) సీఎం మాన్ సాహిబ్‌తో మాట్లాడాను. దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని, శాంతిభద్రతలు కాపాడాలని కోరుతున్నాను. దేవుడు అతని ఆత్మకు శాంతి చేకూర్చాలి ”. ఇదిలా ఉండగా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఘటనపై మాట్లాడుతూ, "సిద్ధూ మూసే వాలా దారుణ హత్య"పై తాను "దిగ్భ్రాంతి చెందానని, తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఘటన వెనుకాల.. ప్రమేయం ఉన్న ఏ ఒక్కరిని విడిచిపెట్టబోమని తెలిపారు. ప్రస్తుతం సిద్ధూ మూసే వాలా.. ఆలోచనలు, ప్రార్థనలు అతని కుటుంబం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అభిమానులతో ఉన్నాయన్నారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని, సంయమనం పాటించాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విజ్ఞప్తి చేశారు.

పంజాబ్  ప్రప్రభుత్వం మూసేవాలా (Sidhu Moose Wala) భద్రతను తగ్గించిన 24 గంటలలోపే ఆయన మాన్సా జిల్లాలోని అతని గ్రామ సమీపంలో కాల్చి చంపబడ్డాడు. మూసేవాలాను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మాన్సా ఆసుపత్రిలోని సివిల్ సర్జన్ మూసేవాలా చనిపోయాడని తెలిపారు. మిగిలిన ఇద్దరిని చికిత్స కోసం మరొక ఆసుపత్రికి రెఫర్ చేశారు. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఈ హత్యకు బాధ్యత వహించాడు. ఈ హత్యలో లారెన్స్ బిష్ణోయ్ పేరు కూడా తెరపైకి వచ్చింది.

First published:

Tags: Aravind Kejriwal, Crime news, Delhi, Punjab

ఉత్తమ కథలు