ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలాను (Sidhu Moose Wala) గుర్తుతెలియని దుండగులు మే 29 న అతి దారుణంగా హత్య చేశారు. ఆయనపై దాదాపు.. 30 బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆతర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, బంధువుల మధ్య అంత్యక్రియలు జరిగాయి. యావత్ దేశమంతా ఆయన చనిపొవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చాడం ఎవరి తరం కాలేదు. వారు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఆయన అభిమానులు కూడా సిద్ధూ మూసేవాలకు అంతిమ వీడ్కొలు పలకడానికి (last rites) పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే, పంజాబ్ ప్రభుత్వం.. మూసేవాలా హత్య ఘటనపై సీరియస్ అయ్యింది. పంజాబ్ (Punjab) పోలీసులు మూసేవాలా అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటల్లోనే కీలక నిందితుడిని అరెస్టు చేశారు. ఈ హత్యకేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న మన్ ప్రీత్ ను (Manpreet) పోలీసులు ఉత్తర ఖండ్ లో (Uttara khand) అరెస్టు చేశారు. కాల్పులు జరిపిన ఆరుగురిలో మన్ ప్రీత్ ఒకరిగా పోలీసులు తెలిపారు. ఇతడిని కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది. మిగతా నిందితులను తొందరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా సిద్ధూ మూసే వాలా మరణంతో ఆయన పెంపుడు కుక్కలు కూడా ఆహరం తినడం మానేశాయి.
కాంగ్రెస్ నేత, పంజాబ్ ఫేమస్ గాయకుడు సిద్ధూ మూసే వాలాను (Sidhu Moose Wala) ఆదివారం దుండగులు గన్ తో కాల్చి అత్యంత దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. మాన్సా జిల్లాలోని తన గ్రామ సమీపంలో ఇద్దరు స్నేహితులతో మహేంద్ర థార్ వాహనంలో వెళ్తున్న సిద్ధూ మూసే వాలాను సుమారు పది మంది చుట్టుముట్టి కాల్చారు. పంజాబ్(Punjab) ప్రభుత్వం మూసేవాలా (Sidhu Moose Wala) భద్రతను తగ్గించిన 24 గంటలలోపే జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
సిద్ధూ మూసే వాలా శరీరంపై 24 చోట్ల బుల్లెట్ గాయాలు ఉన్నట్లు అటాప్సీ రిపోర్ట్‌లో తేలింది. కేవలం రెండు నిమిషాల లోపే సుమారు 30 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టమ్ తర్వాత సిద్దూ భౌతికదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. స్వగ్రామంలో సిద్దూకు అంత్యక్రియలు నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు, జనం అంత్యక్రియలకు హాజరయ్యారు.
సిద్ధూ మూసేవాలా హత్య వార్త అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా.. అతడి పెంపుడు కుక్కలను కూడా తీవ్రంగా కలిచివేస్తోంది. సిద్ధూ కనిపించకపోవడంతో ముద్ద కూడా ముట్టడం లేదు అతడి పెంపుడు కుక్కలు. ఈ హృదయ విదారక వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ కుక్క విచారంగా మూలకు కూర్చోగా, మరో కుక్క బాధతో అరుస్తూ కనిపించింది. ఈ వీడియో నెటిజన్లకు కన్నీళ్లు తెప్పిస్తోంది. వీడియో చూసినవారంతా బ్రోకెన్ హార్ట్ ఎమోజీలతో కామెంట్ చేస్తున్నారు. ఈ రెండు పెంపుడు కుక్కలనీ సిద్దూ ఎంతో ప్రేమగా చూసుకునేవాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brutally murder, Congress, Punjab