Home /News /crime /

SIDDIPET RESIDENT MADHU HAD GONE TO SAUDI ARABIA A WEEK AGO AND DIED IN A ROAD ACCIDENT MDK PRV

Siddipet: వారం కిందటే సౌదీకి పయనం.. కానీ.. అంతలోనే ఊహించని దారుణం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సౌదీ లాంటి దేశాలకు  వెళుతూ అక్కడ కాయాకష్టం చేసుకుపి బ్రతుకుతూ ఉంటారు చాలామంది. ఏదో పండుగలకో పబ్బాలకో ఇండియా తిరిగొచ్చి తమ కుటుంబ సభ్యులతో నాలుగు రోజులు గడిపి.. కొండంత సంతోషంతో తిరిగి వెళతారు. అలాంటి కథ.. సిద్ధిపేట వాసి మధు కథ. 

    (K. Veeranna, News 18, Medak)

    బతుకుదెరువు కోసం కన్న ఊరు కాదని సౌదీ (Saudi) లాంటి దేశాలకు  వెళుతూ అక్కడ కాయాకష్టం చేసుకుపి బ్రతుకుతూ ఉంటారు చాలామంది. ఏదో పండుగలకో పబ్బాలకో ఇండియా తిరిగొచ్చి తమ కుటుంబ సభ్యులతో (family memebers) నాలుగు రోజులు గడిపి.. కొండంత సంతోషంతో తిరిగి వెళతారు. అలాంటి కథ.. సిద్ధిపేట వాసి మధు కథ.  సౌదీ అరేబియాలో  (Saudi Arabia)బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట (Siddipet) జిల్లా దుబ్బాక మండలం రాజుక్క పేటకు చెందిన మొగుల్ల' మధు(35)  మృతి చెందాడు.  మధు (madhu) తల్లిదండ్రులు బాలయ్య, లక్ష్మి.  పీజీ బీఈడీ వరకు చదివాడు మధు. ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా రాకపోవడం. ఉన్న ఊళ్లో సైతం ఎలాంటి ఉపాధి లేకపోవడంతో గత్యంతరం లేక పని కోసం 2009లో గల్ఫ్ బాట పట్టాడు. మధుకు భార్య లావణ్యతో పాటు కొడుకు ఆశి స్వత్ (10), కూతరు వేదశ్రీ(2) ఉన్నారు. 13 ఏళ్లుగా అక్కడ డీసీఎం డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితమే సౌదీనుంచి సెలవులపై స్వదేశానికి వచ్చాడు.

    కుటుంబ సభ్యులతో సరదాగా గడిపి వారం క్రితం (జూన్ 1న) మళ్లీ సౌదీకి తిరిగి వెళ్లాడు. నాలుగు రోజుల క్రితమే డ్యూటీలో (On duty) చేరాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 8 గంటలకు తాను నడుపుతున్న వాహనంను మరో వాహనం ఢీ కొట్టడంతో జరిగిన ప్రమాదంలో (Road accident) అక్కడికక్కడే మృతి చెందాడు మధు. ఈ విషయాన్ని సౌదీలో ఉంటున్న ఆయన పెద్దన్న నర్సిం లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

    మమ్మీ..  నాన్న రాడా?

    మధు మృతిచెందాడన్న విషయం తెలియడంతో కుటింబీకులు (family members), బంధువులు, గ్రామస్తులు రోదించడాన్ని చూస్తూ ఆయన పిల్లలు నాన్నకు ఏమైంది. నాన్న ఇంటికి రాడా? అంటూ ఏం అర్ధం గాక అమాయకత్వంతో బంధువులను అడగడం అక్కడి వారందరినీ కలచివేసింది. తల్లి ఏడస్తుంటే నాన్న ఎప్పుడోస్తడు మమ్మీ అంటూ అడగడంను చూసి ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టారు.

    శోక సంద్రమైన రాజక్క పేట..

    అందరితో కలిసి మెలిసి ఉండే మధు. సౌదీలో మృతిచెందడంతో రాజక్కపేటలో తీవ్ర విషాదం అలుముకుంది. ‘‘ఉన్నత చదువులు (Higher studies) చదివి ఉద్యోగం రాక గల్ఫ్ పోయిండు. వారం క్రితమే పోతున్నా అంటూ అందరినీ కలిసి చెప్పి పోయిండు .ఇంతలోనే ఈఘోరం జరిగింది’’ అతని స్నేహితులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.  అయితే  మధు మృతదేహాన్ని తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) సాయం చేయాలని కుటుంబంతో పాటు గ్రామస్తులు వేడుకుంటున్నారు. రోడ్డున పడ్డ మధు కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Road accident, Saudi Arabia, Siddipet

    తదుపరి వార్తలు