‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.’ అంటూ పోలీసులకు ఏమైనా ఫోన్లు వస్తే ఏం చేస్తారు? చాలా వరకు సీరియస్ గానే తీసుకుంటారు. కొందరు పోకిరీలు కూడా ఇలా ఫేక్ కాల్స్ చేసి పోలీసులతో గేమ్స్ ఆడుతూ ఉంటారు. కానీ, సిద్దిపేట జిల్లా పోలీసులు మాత్రం కాల్స్‌ను సీరియస్‌గానే తీసుకున్నారు. ఓ ప్రాణాన్ని కాపాడగలిగారు. ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి డయల్ 100 కు ఫోన్ చేసి తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపి ఫోన్ పెట్టేశాడు. వెంటనే డీజీపీ ఆఫీస్ డయల్ 100 సిబ్బంది సిద్దిపేట కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది సిద్దిపేట టూ టౌన్ బ్లూ కోల్డ్స్ సిబ్బంది శ్రీనివాస్, రమేష్ కానిస్టేబుల్ కు జీపీఎస్ సమాచారం పంపించగా దాని ద్వారా వెతుక్కుంటూ వెళ్లారు. సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల చెరువు కట్ట పైన ఒక వ్యక్తి పడుకుని ఉండగా వెంటనే వెళ్లారు. 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి అంబులెన్స్ రాగానే అతని అంబులెన్స్ లో ఎక్కించుకొని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేయించారు. అనంతరం అతడి గురించి విచారించగా అతని పేరు వట్కారి శ్రీనివాస్‌గా తెలిపాడు. సిద్దిపేట వివేకానంద కాలనీ అని తెలిపాడు. సరైన సమయంలో స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడినందుకు సిద్దిపేట టూ టౌన్ బ్లూ కోల్డ్స్ సిబ్బంది శ్రీనివాస్ రమేష్ ను పోలీస్ కమిషనర్ అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Siddipet, Telangana, Telangana Police