Home /News /crime /

SIDDIPET POLICE HAVE ARRESTED A WOMAN WHO INTRODUCED HERSELF AS A SUB INSPECTOR AND CHEATED THE UNEMPLOYED INTO GIVING HER JOBS IN THE POLICE DEPARTMENT MDK PRV

Government jobs Fraud: నిండా మునిగిన నిరుద్యోగులు.. మంత్రి హరీశ్​రావుతో సన్మానం.. కమిషనర్​తో ఫొటోలు.. ఆ కిలేడీ ఎత్తులకు చిత్తైన యువత..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

సబ్​ఇన్​స్పెక్టర్​గా పరిచయం చేసుకున్న ఓ మహిళ ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల నుంచి వసూలు చేసింది.  నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని  డబ్బులు వసూలు చేసింది .

    ( కె.వీరన్న, New 18 ప్రతినిధి, మెదక్ జిల్లా)

    సబ్​ఇన్​స్పెక్టర్​ (Sub Inspector)గా పరిచయం చేసుకున్న ఓ మహిళ ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల నుంచి వసూలు చేసింది.  నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు (Jobs) ఇప్పిస్తామని  డబ్బులు (money) వసూలు చేసింది.  ఈ ఘటన సిద్దిపేట (Siddipeta) జిల్లాలో చోటుచేసుకుంది. దళారుల హమీలను నమ్మి నిరుద్యోగ యువత మోసపోతోంది. తాను ఏఎస్ఐ అంటూ పోలీస్ డిపార్ట్మెంట్ (Police department) ఉద్యోగాలు ఇప్పి స్తానంటూ మోసం చేస్తున్న హస్నాబాద్ కు చెందిన మహిళపై శనివారం రాత్రి సిద్దిపేట రూరల్  (Siddipeta Rural)పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆదివారం ఎస్ఐ అమర్( SI Amar) వివరాలు వెల్లడించారు.

    హుస్నాబాద్ (Husnabad) మండలం పోతారం (ఎస్) గ్రామానికి చెందిన బోయిని విజయ భారతి 2018-19లో ఎస్ఐ ఉద్యోగం కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ తీసుకుం ది. శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగాలకు (Jobs) ఎంపికైన వారికి సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు (Minister Harish rao), అప్పటి సీపీ (Commissioner) జోయల్ డేవిస్ చేతుల మీదుగా సన్మానం చేశారు. విజయభారతికి ఉద్యోగం రాకపోయినా అధికారులు కళ్లు గప్పి మంత్రి, సీపీ చేతుల మీదుగా సన్మానం పొందింది. ఆ ఫొటోలు (Photos) నిరుద్యోగులకు చూపి పోలీస్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమా టలు చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్షలు వసూలు చేసింది.

    ఉద్యోగం ఇప్పించక పోతే డబ్బులు (Money) తిరిగి ఇస్తానని బాండ్ పేపర్ (Bond Paper) మీద రాసి ఇచ్చింది. ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడతో బాధితులు ఆమెను కలిసేందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చేది. కొద్దిరోజులకు హుస్నాబాద్ నుంచి మకాం మార్చింది.

    నాలుగు నెలలుగా వెతికి..

    బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట (Siddipet) జిల్లాలోనే కాకుండా నల్లగొండ, మిర్యాలగూడ, కుకునూరుపల్లి, గజ్వేల్, హుస్నాబాద్, వరంగల్ (Warangal) జిల్లాల్లోని నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి డబ్బు వసూలు చేసింది.  బాధితులు వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా కేసు (case) నమోదు కాకుండా చేసుకున్నట్లు బాధితులు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నారాయణ రావుపేట మండల కేంద్రానికి చెందిన గణేశ్ ఉద్యోగం కోసం తాను రూ.10 లక్షలు ఇచ్చానని సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో గతేడాది డిసెం బర్ 20 తేదీన ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం విజయభారతిని అరెస్టు (Vijaya bhatarthi Arrested) చేసి స్టేషన్ తీసుకొచ్చారు. కోర్టులో హాజరు పరుస్తామని ఎస్ఐ తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Fake jobs, Medak, Police jobs

    తదుపరి వార్తలు