వివాహితపై తుపాకీ (Revolver) గురిపెట్టి అత్యాచారం చేయడంతో పాటు ఆమెను భర్తతో సహా కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేసిన మాజీ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు (CI Nageshwar rao)కు చర్లపల్లి జైలు అధికారులు అండర్ ట్రయల్ (యూటీ) ఖైదీ నెం.2001 కేటాయించారు. సోమవారం నాగేశ్వర్రావును అరెస్టు చేసిన వనస్థలిపురం పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలు (Charlapalli jail)కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం నాగేశ్వర్రావును పది రోజుల పాటు తమ కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన నోటీసులను పోలీసులు బుధవారం జైలులో నాగేశ్వర్రావుకు ఇచ్చారు. వనస్థలిపురం పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలకాంశాలు ప్రస్తావించారు.
కోర్టుకు వాంగ్మూలం..
ఈ నెల 7వ తేదీన నాగేశ్వరరావు తనపై అత్యాచారం (Rape) చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ నెల 11న నిందితుడిని అరెస్ట్ చేసి.. చర్లపల్లి జైలుకు తరలించారు. కోర్టుకు సమర్పించిన అతడి వాంగ్మూలంలో పలు అంశాలను పోలీసులు పేర్కొన్నారు. కాగా, అత్యాచారం, బెదిరింపుల కేసులో అరెస్టై చర్లపల్లి ఏ జైల్లో ఉన్న మాజీ సీఐ నాగేశ్వరరావును పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. బుధవారం ఆయనకు మారేడ్‌పల్లి పోలీసులు సస్పెన్షన్ ఉత్తర్వులు అందజేసినట్లు జైలు అధికారులు తెలిపారు.
తన కాపలాదారు భార్య (Security guard Wife)పై అత్యాచారం చేశానని.. విషయం బయటపెడితే చంపేస్తానంటూ రివాల్వర్ (Revolver) బెదిరించాననీ మారేడ్‌పల్లి మాజీ ఇన్ స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేరాన్ని అంగీకరించాడు. లైంగిక దాడి ఆనవాళ్లు మాయం చేసేందుకు తన దుస్తులు తానే ఉతుక్కున్నానని చెప్పాడని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో వనస్థలిపురం పోలీసులు పేర్కొన్నారు.
త్వరితగతిన విచారణ..
ఈ కేసు సంచలనం సృష్టించడంతో బాధితురాలి ఇంటి దగ్గర, ఇబ్రహీంపట్నం రహదారిలో, అక్కడ నుంచి కొత్తపేటకు వచ్చే మార్గంలో ఇలా అనేక ప్రాంతాల నుంచి సీసీ కెమెరాల ఫీడ్ సేకరించారు పోలీసులు. బాధితురాలి నుంచి సీఆర్పీసీ 161 సెక్షన్ ప్రకారం వాంగ్మూలం రికార్డు చేయడంతో పాటు బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించారు. నేరం జరిగిన ప్రాంతమైన బాధితురాలి ఇంటి నుంచి కీలకాధారాలుగా పరిగణించే రెండు గాజులు, తల వెంట్రుకలు, బెడ్‌షీట్ స్వాధీనం చేసుకున్నట్లు వీటిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. దీంతో పాటు ఇబ్రహీంపట్నం చెరువు కట్ట వద్ద జరిగిన కారు ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలిసిన పోలీసులు, కారు మరమ్మతులకు తీసుకువెళ్లిన మెకానిక్‌లు, బాధితురాలి ఇంటి వద్ద ఉన్న వారు సహా మొత్తం 17 మందిని సాక్షులుగా పరిగణిస్తూ వారి నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Hyderabad, Rape case