హైదరాబాద్ అమీర్‌పేటలో ఎస్సై ఆత్మహత్య

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఎస్సై సైదులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

news18-telugu
Updated: December 23, 2019, 11:33 AM IST
హైదరాబాద్ అమీర్‌పేటలో ఎస్సై ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పనిఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక కొందరు పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా  మరో ఎస్సై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ అమీర్‌పేటలో చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఎస్సై సైదులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు నెలల క్రితమే సైదులు విధుల్లో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీసీఎస్‌లో ఎస్సై విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఎస్సై ఆత్మహత్యకు ఆరోగ్యపరమైన సమస్యలే కారణమని తెలుస్తుంది. భార్య పిల్లల్నిస్కూల్‌కు దిగబెట్టి ఇంటికి వచ్చే లోపే భర్త సైదులు ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు. మొబైల్ కోర్టులో కూడా సైదులు ఆరేళ్లు పనిచేస్తున్నట్లు భార్య నీలిమ తెలిపారు. మొబైల్ కోర్టు నుంచి విధుల్లో నుంచి రలీవ్ అయిన సమయంలో... కూడా సైదులు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు భార్య పోలీసులకు తెలిపారు.
Published by: Sulthana Begum Shaik
First published: December 23, 2019, 11:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading