HOME »NEWS »CRIME »si accused of sexually assaulting woman in amaravati andhra pradesh bn

మహిళపై ఎస్ఐ లైంగిక దాడికి యత్నం.. వ్యభిచారం కేసు పెడతానంటూ..

మహిళపై ఎస్ఐ లైంగిక దాడికి యత్నం.. వ్యభిచారం కేసు పెడతానంటూ..
ప్రతీకాత్మక చిత్రం

ఓ జంట ఏకాంతంగా గడిపేందుకు అమరావతిలోని ఓ లాడ్జికి వచ్చారు. విషయం తెలుసుకున్న అమరావతి ఎస్ఐ రామాంజనేయులు తన వ్యక్తిగత వాహనంలో డ్రైవర్ సాయికృష్ణతో కలిసి లాడ్జికి చేరుకున్నారు.

  • Share this:
    ఆపదలో ఉన్న మహిళల్ని రక్షించాల్సింది పోయి.. తానే అసభ్యంగా ప్రవర్తించాడో ఎస్ఐ. పైగా ఈ విషయం ఎవరికైనా చెబితే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందంటూ బెదిరించాడు. ఈ ఘటన మరెక్కడో కాదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పెదకూరపాడుకు మండలానికి చెందిన ఓ జంట ఏకాంతంగా గడిపేందుకు అమరావతిలోని ఓ లాడ్జికి వచ్చారు. విషయం తెలుసుకున్న అమరావతి ఎస్ఐ రామాంజనేయులు తన వ్యక్తిగత వాహనంలో డ్రైవర్ సాయికృష్ణతో కలిసి లాడ్జికి చేరుకున్నారు. ఏకాంతంగా గడిపేందుకు వచ్చిన ఆ జంట వద్దకు వెళ్లి రూ.10వేలు లంచం ఇవ్వాలని లేకుంటే.. వ్యభిచారం కేసు నమోదు చేస్తానంటూ ఎస్ఐ బెదిరించారు.

    దీంతో భయపడిపోయిన జంట మా దగ్గర అంత డబ్బులేదని రూ.5వేలు ఇస్తామని తెలిపారు. అయితే అప్పటికి వారి దగ్గర ఉన్న రూ.3 వేలు ఇచ్చి, మరో రూ.2వేల కోసం డ్రైవర్ సాయికృష్ణకు ఇవ్వాలంటూ జంటగా వచ్చిన వ్యక్తిని ఏటీఎం వద్దకు పంపారు. ఆ తర్వాత లాడ్జిలో ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఏటీఎం వద్దకు వెళ్లిన వ్యక్తి వచ్చేంత వరకు ఆ మహిళ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటుంది.



    కాపాడాల్సిన చేతులే ఎక్కడెక్కడో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ మహిళకు ఏం చేయాలో అర్ధం కాలేదు. పైగా ఈ విషయం ఎవరికైనా చెబితే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఆ జంటను బెదిరించారు. వారి పూర్తి వివరాలు తీసుకుని అనంతరం విడిచిపెట్టారు. దీంతో బాధితులు మంగళవారం ఎస్ఐపై తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
    Published by:Narsimha Badhini
    First published:June 10, 2020, 08:15 IST