దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధ వాకర్ (Shraddha Walkar) హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తుంది. హత్య జరిగిన తీరు చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. శ్రద్ధ వాకర్ (Shraddha Walkar)ను 35 ముక్కలుగా చేసిన ఆఫ్తాను అఫ్తాబ్ (Afthab Ameen) ఆ తరువాత ఆ ముక్కల్ని 3 వారాల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచడం, ఆ సమయంలోనే వేరే అమ్మాయిని రూమ్ కు తీసుకొచ్చుకోవడం, ఆ తరువాత శ్రద్ధ శరీర భాగాల్ని 18 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వేయడం ఇలా రోజుకో విషయం బయటకు వచ్చింది. ఇక తాజాగా ఈ హత్య కేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది.
ఈ కేసులో నిందితునికి రోహిణి ఆసుపత్రిలో నార్కో అనాలిసిస్ టెస్ట్ పూర్తి చేశారు. ఈ క్రమంలో నిందితుడు అఫ్తాబ్ (Afthab Ameen) పలు కీలక విషయాలు వెల్లడించాడు. శ్రద్దా తను ప్రేమించుకుంటున్నామని, తనను చంపాలని చాలా రోజుల నుండి చూస్తున్న అన్నారు. తానే శ్రద్దా (Shraddha Walkar)ను హత్య చేసి శరీర భాగాలను వేర్వేరు చోట్ల విసిరేసినట్టు తెలిపారు. అలాగే హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధాలు ఏవి. అవి ఎక్కడ పడేశాడో కూడా వివరణ ఇచ్చాడు. అయితే వారి ప్రశ్నలకు కొంత సమయం తీసుకున్నా కూడా నేరాన్ని ఒప్పుకున్నట్టు తెలిపారు. అయితే ఇప్పటికి అఫ్తాబ్ విచారణకు సహకరిస్తున్నప్పటికీ కూడా అతని ప్రవర్తనపై అనుమానం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే అతనికి నార్కో టెస్ట్ తో పాటు ఫాలిగ్రామ్ టెస్ట్ కూడా చేశారు.
ఫాలిగ్రామ్ టెస్ట్ లోను సంచలన నిజాలు..
ఇక తాజాగా నిందితుడు అఫ్తాబ్ (Afthab Ameen) కు పాలిగ్రామ్ టెస్ట్ చేసిన అధికారులకు విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఈ పరీక్ష నిర్వహిస్తున్నప్పుడు అఫ్తాను చాలా కూల్ గా, నార్మల్ ఉండడం అధికారులను ఒకింత ఆశ్చర్యపరిచింది. అంతేకాదు శ్రద్ధ వాకర్ (Shraddha Walkar) శరీరాన్ని ముక్కలుగా చేయడానికి అఫ్తాబ్ (Afthab Ameen) ఏకంగా 5 కత్తులను వాడినట్లు పరీక్షల్లో తేలింది. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి పొడుగు 5-6 అంగుళాలు కాగా చాలా పదునైనవని పాలిగ్రామ్ టెస్ట్ లో తేలింది. అఫ్తాన్ ఈ కత్తులను శ్రద్ధ (Shraddha Walkar) శరీర భాగాలు కోయడానికి ఉపయోగించాడా లేదా అనేది ఈ పరీక్ష నిర్ధారిస్తుందని, అందుకోసమే ఈ పరీక్ష నిర్వహించామని అధికారులు తెలిపారు. ఇక తాజాగా నార్కో టెస్ట్ కూడా చేశారు. ఇక తరువాత మరో టెస్ట్ కూడా చేయనున్నారు.
అసలు కేసు ఏంటంటే?
ముంబైలోని ఓ కాల్ సెంటర్ లో శ్రద్ధ, అఫ్తాన్ పని చేసేవారు. ఇక అక్కడి పరిచయ డేటింగ్ చేసే వరకు దారి తీసింది. అయితే శ్రద్ధ కుటుంబం వీరి సంబంధాన్ని ఆమోదించలేదు. దీనితో వారు ఢిల్లీకి పారిపోయి రిలేషన్ షిప్ లోనే వున్నారు. అయితే శ్రద్ధ తల్లిదండ్రులు మాత్రం ఆమె యోగక్షేమాలను సోషల్ మీడియా పోస్టుల ద్వారా తన యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె చాలా కాలంగా సోషల్ మీడియా ఖాతాలో ఎటువంటి పోస్టులు కనపడలేదు. దీనితో శ్రద్ధ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brutally murder, Crime, Crime news, Delhi