నైట్ క్లబ్‌లో కాల్పులు.. 15 మంది దుర్మరణం

మెక్సికోలోని గునాంజుటావ్ రాష్ట్రంలో ‘లా ప్లాయా’ క్లబ్‌లో కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. అందరూ జోష్‌లో ఉన్న సమయంలో కొందరు సాయుధులు వచ్చి ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరిపారు.

news18-telugu
Updated: March 9, 2019, 10:51 PM IST
నైట్ క్లబ్‌లో కాల్పులు.. 15 మంది దుర్మరణం
ప్రతీకాత్మక చిత్రం (Image courtesy: Twitter)
news18-telugu
Updated: March 9, 2019, 10:51 PM IST
మెక్సికోలోని ఓ నైట్ క్లబ్‌లో కాల్పులు జరిగాయి. సుమారు 15 మంది చనిపోయినట్టు సమాచారం. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపినట్టు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది. మెక్సికోలోని గునాంజుటావ్ రాష్ట్రంలో ‘లా ప్లాయా’ క్లబ్‌లో కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. అందరూ జోష్‌లో ఉన్న సమయంలో కొందరు సాయుధులు వచ్చి ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరిపారు. ఈ దాడిలో క్లబ్‌కు వచ్చిన వారితో పాటు సిబ్బందికి కూడా బుల్లెట్స్ తగిలాయి. కాల్పులు జరిగిన వెంటనే అందులో ఉన్న వారు పెద్ద పెట్టున కేకలు వేశారు. అందరూ కంగారుతో పరుగులు తీశారు. ఈ క్రమంలో కాల్పులు జరిపిన వ్యక్తులు కూడా వారితోకలసి పారిపోయినట్టు భావిస్తున్నారు. హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు సాయుధులు ఓ ట్రక్‌లో ఆ నైట్ క్లబ్ ప్రాంతానికి వచ్చారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారు వచ్చిన కొద్దిసేపటికే నైట్ క్లబ్‌లో కాల్పులు జరిగాయి.

First published: March 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...