వేరే అమ్మాయిని అలా చూశాడని బాయ్‌ఫ్రెండ్‌ను కత్తితో పొడిచిన ప్రియురాలు...

ఏడాది పాటు ప్రేమించి, డేటింగ్ కూడా చేసిన ఫ్లోరిడా జంట... అతని కారణంగా గర్భం కూడా దాల్చిన ఆమె... స్నేహితుడి గర్ల్‌‌ఫ్రెండ్ ఫోటోను తదేకంగా చూడడంతో మొదలైన గొడవ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 15, 2019, 3:23 AM IST
వేరే అమ్మాయిని అలా చూశాడని బాయ్‌ఫ్రెండ్‌ను కత్తితో పొడిచిన ప్రియురాలు...
నమూనా చిత్రం
  • Share this:
అమ్మాయిలు దేన్నైనా తట్టుకోగలరు కానీ తన పక్కనే ఉండగా వేరే అమ్మాయిని చూసినా, పొడిగినా అస్సలు తట్టుకోలేరు. ఇది ఇంతకుముందు చాలా సందర్భాల్లో నిరూపితమైంది కూడా. తాజాగా తన బాయ్‌ఫ్రెండ్ వేరే అమ్మాయి ఫోటో చూస్తున్నాడని ఆవేశానికి లోనైన ఓ అమ్మాయి... అతన్ని కత్తితో పొడిచేసింది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ లవర్ అటాక్ ఫ్లోరిడాలో జరిగింది. ఫ్లోరిడాకు చెందిన జూలిట్టా ఎమిలీ అనే అమ్మాయి ఓ అబ్బాయి ప్రేమలో పడింది. చూడడానికి చాలా అందంగా ఉండే ఆ కుర్రాడు తనకు మాత్రమే సొంతం కావాలని కోరుకుంది. అతనితోనే జీవితం పంచుకోవాలని ఇంట్లోవాళ్లను కూడా ఒప్పించింది. ఇద్దరూ సినిమాలకూ, పార్కులకు కలిసి తిరిగారు. ఈ డేటింగ్ కారణంగా జూలిట్టా గర్భం కూడా దాల్చింది. ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదని పెళ్లి చేసుకునేందుకు ఫిక్స్ అయ్యారు కూడా.

అయితే అనుకోని సంఘటన మొత్తం మార్చేసింది. బాయ్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు అతను ఉంటున్న ఇంటికెళ్లింది జూలిట్టా. ఆమె, తన బాయ్‌ఫ్రెండ్, మరో స్నేహితుడు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో మరో స్నేహితుడు తన గర్ల్‌ఫ్రెండ్ ఫోటోను జూలిట్టాకు, ఆమె బాయ్‌ఫ్రెండ్‌కూ చూపించాడు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండడంతో ఫోటో వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు జూలిట్టా బాయ్‌ఫ్రెండ్. దాన్ని గమనించిన జూలిట్టా... అతనితో గొడవకు దిగింది. ఇద్దరూ ఓ గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నారు. లోపలి నుంచి వస్తున్న శబ్దాలను బట్టి అక్కడ గొడవ బీభత్సంగా జరిగిందని గ్రహించాడు స్నేహితుడు. కొద్దిసేపటి తర్వాత జూలిట్టా బాయ్‌ఫ్రెండ్ కత్తిపోటుతో గదిల్లోంచి బయటికి వచ్చాడు. ‘అది నన్ను పొడిచేసింది’ అంటూ కిందపడిపోయాడు. అతని వెనకే వచ్చిన జూలిట్టా... ‘నేను పక్కనే ఉండగా... మరో అమ్మాయి ఫోటోని ఎందుకిలా తదేకంగా చూస్తున్నావ్’ అంటూ అరిచింది. కంగారు పడిన స్నేహితుడు... పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు... జూలిట్టాను అదుపులోకి తీసుకుని, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను ఆసుపత్రికి తరలించారు.


First published: March 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు