మూడేళ్ల కూతుర్ని కారులో లాక్ చేసి... బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్... ఆ తర్వాత...

కూతుర్ని కారులో లాక్ చేసిన విషయం మరిచిపోయి... బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్‌... నాలుగు గంటల తర్వాత మెలకువ వచ్చి వచ్చి చూసేసరికి విగతజీవిగా మారిన చిన్నారి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 22, 2019, 7:47 PM IST
మూడేళ్ల కూతుర్ని కారులో లాక్ చేసి... బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్... ఆ తర్వాత...
ప్రియుడితో ఆ పని చేసేందుకు... కన్నకూతుర్ని (నమూనా చిత్రం)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 22, 2019, 7:47 PM IST
కామంతో కళ్లు మూసుకుపోయినవారికి మరో ఆలోచన ఉండదనేది పాత సామెత. వివాహేతర సంబంధం కోసం కన్నవారినీ, కట్టుకున్నవారినీ అత్యంత పైశాచికంగా చంపుతున్నవారి గురించి వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఇదే నిజమేనని అనిపిస్తుంది. తాజాగా అలాంటి దారుణమే అమెరికాలోని మిస్సిసిప్పి రాష్ట్రంలో వెలుగుచూసింది. బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేసేందుకు మూడేళ్ల చిన్నారిని కారులో లాక్ చేసింది వెళ్లిందో తల్లి. తల్లి ఎంతకీ రాకపోవడంతో గాలి ఆడక... కారులోనే ప్రాణాలు విడిచిందా చిన్నారి. మిస్సిసిప్పి ఏరియాలో ఉంటున్న 29 ఏళ్ల బార్కర్... తన మూడేళ్ల కూతురితో కలిసి స్థానికంగా ఉన్న ఓ షాపుకి వెళ్లింది. పాపను కారులోనే పెట్టి లాక్ వేసిన బార్కర్... చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్ తీసుకుని ఇప్పుడే వస్తానంటూ షాపులోపలికి వెళ్లింది. అయితే సదరు షాపు సూపర్‌వైజర్‌తో బార్కర్‌కు వివాహేతర సంబంధం ఉంది.

షాపు లోపలికి వెళ్లిన వెంటనే ఆమె కూతుర్ని కారులో లాక్ చేసిన విషయం మరిచిపోయి... బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్‌లో మునిగిపోయింది. చిన్నారి విషయం మరిచిపోయి... ఆ పనిలో రెచ్చిపోయి, తర్వాత అలసిపోయి అతని బెడ్‌ మీద ఆదమరిచి నిద్రపోయింది కూడా. దాదాపు నాలుగు గంటల తర్వాత మెలకువ వచ్చిన తర్వాత ఆమెకు కారులో లాక్ చేసిన కూతురు గుర్తుకు వచ్చింది. వెంటనే వచ్చి చూసేసరికి... ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయి కనిపించింది. మిట్టమధ్యాహ్నం పూట మండుటెండలో కారుని పార్క్ చేయడం, అద్దాలు తెరిస్తే అందులోంచి చిన్నారి బయటికి వస్తుందేమోననే అనుమానంతో అన్నీ లాక్ చేయడంతో వేడి, ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయింది మూడేళ్ల పసికందు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు... సంఘటనా స్థలానికి చేరుకుని బార్కర్‌పై కేసు నమోదు చేశారు. అక్కడి చట్టాల ప్రకారం ఆ తల్లికి 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు భారీ జరిమానా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


First published: March 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...