అమ్మాయిల హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరా...షాకింగ్ వీడియోలు బయటపడగానే...

గర్ల్స్‌ హాస్టల్‌లో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి.. అమ్మాయిల ప్రైవేట్‌ వీడియోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న దారుణ ఘటన వెలుగు చూసింది. ఇటీవల ఓ యువకుడు తన ప్రియురాలు బట్టలు మార్చుకుంటున్న వీడియోను ఇంటర్నెట్‌లో చూసి ఖంగుతిన్నాడు.

news18-telugu
Updated: August 10, 2020, 12:04 AM IST
అమ్మాయిల హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరా...షాకింగ్ వీడియోలు బయటపడగానే...
నమూనా చిత్రం
  • Share this:
అమ్మాయిల భద్రతకు రక్షణ లేకుండా పోయింది. ప్రైవేట్‌ హాస్టళ్లలో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంది. సీక్రెట్‌ కెమెరాలను అమర్చి కొందరు దుర్మార్గులు అమ్మాయిల జీవితాలతో ఆటలడాకుంటున్నారు. అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు వీడియోలను రికార్డు చేసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి గురుగ్రాంలో చోటు చేసుకుంది. గర్ల్స్‌ హాస్టల్‌లో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి.. అమ్మాయిల ప్రైవేట్‌ వీడియోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న దారుణ ఘటన వెలుగు చూసింది. ఇటీవల ఓ యువకుడు తన ప్రియురాలు బట్టలు మార్చుకుంటున్న వీడియోను ఇంటర్నెట్‌లో చూసి ఖంగుతిన్నాడు. వెంటనే విషయం అమ్మాయికి చెప్పడంతో నిజం బయటపడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అమ్మాయి వెంటనే తన గదిని క్షుణ్ణంగా పరిశీలించింది. గదిలో మొత్తం నాలుగు సీసీ కెమెరాలు బయటపడ్డాయి. గురుగ్రాంలోని వర్కింగ్‌ ఉమెన్‌, విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. అక్కడ లేడీస్‌ హాస్టళ్లు కూడా ఎక్కువే. అయితే ఇదే విషయమై హాస్టల్‌ యాజమాన్యాన్ని నిలదీసింది. తనకేమీ సంబంధం లేదని, అవి గదుల్లోకి ఎలా వచ్చాయో తనకు తెలియదంటూ హాస్టల్‌ నిర్వాహకుడు సమాధానం ఇచ్చాడు. దీంతో ఆ యువతి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. హాస్టల్‌ యాజమాని.. ఎలక్ట్రీషియన్‌తో కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడని తెలిసింది. సుమారు 2 వేల టీబీ హార్డ్‌ డిస్క్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాస్టల్‌లోని అమ్మాయిల ప్రైవేట్‌ వీడియోలను రికార్డ్‌ చేస్తున్న హాస్టల్‌ యాజమానిని పోలీసులు కటకటాల పాలు చేశారు.
Published by: Krishna Adithya
First published: August 10, 2020, 12:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading