• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • SHOCKING VIDEO SIX MISCREANTS RIDING TWO MOTORBIKES OPENED FIRE AT A SHOP IN RAJASTHANS KOTA GOES VIRAL SRD

Viral Video : అదో మార్కెట్..బైక్ మీద ఆరుగురు వచ్చారు..వ్యాపారికి వేలు చూపిస్తూ వార్నింగ్..అంతలోనే..

Photo Credit : Twitter

Viral Video : ఈ రోజుల్లో ప్రమాదం ఎవరికి ఎప్పుడు ఎటువైపు నుండి వస్తుందో గ్రహించడం చాలా కష్టం. ఏమరపాటుగా ఉంటే ఇక అంతే సంగతులు. రాజస్థాన్ లో జరిగిన ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

  • Share this:
    ఈ రోజుల్లో ప్రమాదం ఎవరికి ఎప్పుడు ఎటువైపు నుండి వస్తుందో గ్రహించడం చాలా కష్టం. ఏమరపాటుగా ఉంటే ఇక అంతే సంగతులు. రాజస్థాన్ లో జరిగిన ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. రాజస్తాన్‌ కోట జిల్లా మార్కెట్‌లో పట్టపగలే బైక్‌పై వచ్చిన దుండగులు తుపాకులతో ఒక షాపు యజమానిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సదరు షాపు యజమాని తృటిలో తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డవడంతో వెలుగులోకి వచ్చింది. మొత్తం 38 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో ముగ్గురు వ్యక్తులు అక్కడున్న మిగతా షాపుల యజమానులకు వేలు చూపిస్తూ వార్నింగ్‌ ఇస్తుండగా.. ఒక వ్యక్తి మాత్రం తుపాకీతో కాల్పులు జరిపి అక్కడినుంచి పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజీలో ఈ దుండగుల కాల్పుల సీన్ స్పష్టంగా కనిపించింది. కైలాష్ మీనా అనే షాపు యజమాని ఇంట్లో ఉండగా అతని పేరు పెట్టి పిలిచిన వీరు ఆయన బయటికి రాగానే కాల్పులు జరిపారు. రెండు బైక్ లపై ఆరుగురు యువకులు వచ్చారని, వారు ఎందుకు తనపై హత్యాయత్నం చేశారో తెలియదని మీనా అంటున్నాడు. పండ్లు, కూరగాయల కమిషన్ ఏజెంట్ అయిన ఈయన కొన్నేళ్లుగా ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.. తనకెవరూ శతృవులు లేరని, అలాంటిది వాళ్ళు తనను టార్గెట్ చేయడానికి గల కారణాలు తెలియడం లేదని ఆయన చెప్పాడు.

    మీనా ఇచ్చిన సమాచారంతో పోలీసులు స్పాట్ ను పరిశీలించారు. దుండగుల్లో ఎవరినీ తాను గుర్తించలేననని మీనా చెప్పాడు. కాగా కైలాష్ మీనా ఈ మండిలో తోటి వ్యాపారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటాడని తెలిసింది. బహుశా అది దృష్టిలో పెట్టుకుని ఎవరైనా ఈ యువకులను ప్రోత్సహించి ఉంటారా అని పోలీసులు భావిస్తున్నారు. అయితే త్వరలోనే వీరిని పట్టుకుని అరెస్ట్ చేస్తామని అన్నారు.

    అయితే, కైలాష్ మీనా ఈ మండిలో తోటి వ్యాపారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటాడని తెలిసింది. బహుశా అది దృష్టిలో పెట్టుకుని ఎవరైనా ఈ యువకులను ప్రోత్సహించి ఉంటారా అని పోలీసులు భావిస్తున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు, 2007 లో కైలాష్ మీనాకు..లిఖాయత్ అనే వ్యక్తికి మధ్య ఘర్షణ జరిగిందని, బహుశా దాన్ని మనసులో ఉంచుకుని పగతో లిఖాయత్ వీరిని పంపి ఉంటాడా అని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. ఏమైనా ఈ ఘటనతో మార్కెట్లోని వారంతా భయాందోళనతో పారిపోయినంత పని చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
    Published by:Sridhar Reddy
    First published: