భావ్‌నగర్: గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీని తీసేందుకు బయటకు వచ్చిన ఓ పెద్దాయనపై ఎద్దు దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. రోడ్డు మీద తిరుగుతున్న ఓ ఎద్దు ఇంటి ముందు ఉన్న స్కూటీ తీసేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై దాడి చేసింది. కొమ్ములతో విసిరేసింది. ఆ వ్యక్తి చొక్కా కొమ్ములకు చిక్కుకోవడంతో చాలా దూరంలో వెళ్లిపడ్డాడు. అప్పటికీ ఆ ఎద్దు ఊరుకోలేదు.
ఆయనను కాళ్లతో తొక్కుతూ, కొమ్ములతో కుమ్ముతూ నానా బీభత్సం చేసింది. ఇంతలో ఆయన కేకలు విని ఇంట్లో నుంచి ఇద్దరు మహిళలు బయటకు వచ్చారు. ఆ ఎద్దును పక్కకు పంపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. ఓ మహిళపై కూడా ఎద్దు విరుచుకపడింది. కొమ్ములతో కుమ్మింది.
ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ
— News18Gujarati (@News18Guj) December 6, 2021
રખડતા ઢોરે એક વ્યક્તિને અડફેટે લીધો, સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ, ઢોરના મારથી ઘાયલ વ્યક્તિ હાલ સારવાર હેઠળ pic.twitter.com/JxPGLNeKWK
కొంతసేపటికి స్థానికులు కొందరు కర్రలతో వచ్చి ఆ ఎద్దును బెదిరించడంతో అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన డిసెంబర్ 4న జరిగినట్లు తెలిసింది. ఈ ఎద్దు దాడిలో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో చర్చనీయాంశంగా మారింది. భావ్‌నగర్‌లో ఇలాంటి ఘటనలు గతంలో కూడా చాలానే జరిగాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కూడా ఇలాంటి ఘటనే కొన్నిరోజుల క్రితం జరిగింది. జామ్‌నగర్ నగర శివార్లలో ఓ యువకుడు ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ బైక్‌పై కూర్చుని ఉండగా అతనిపై ఎద్దు ఒక్కసారిగా దాడి చేసింది.
కొమ్ములతో దాడి చేయడంతో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న పశువులు కొన్నిసార్లు పెట్టిన ఆహారం తింటూ బాగానే ఉంటున్నాయి కానీ కొన్ని సందర్భాల్లో ఇలా దాడి చేస్తున్నాయని వాపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అప్పుడప్పుడూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు బైక్‌పై వెళుతుంటే తరుముకొచ్చి మరీ కుక్కలు కరిచిన ఘటనలూ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cctv footage, Crime news, Gujarat, Viral Video