హైదరాబాద్ లో ఓ ఫాస్ట్‌ఫుడ్ నిర్వాహకుడు కొద్ది రోజుల క్రితం దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడితే ఊహించని ట్విస్టులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వివాహేతర సంబంధమే దీనికి ప్రధాన కారణం కాగా, దాదాపు పదేళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చి మరీ అతడిని హత్య చేయడం కలకలం రేపుతోంది. ‘నేను చంపాలనుకున్నవాడిని చంపే చస్తా‘ అంటూ ఓ సినిమాలో బాలయ్య చెప్పినట్టుగా ఓ వ్యక్తి వెతుక్కుంటూ హతుడి వద్దకు వచ్చాడు. అతడి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లోనే పనోడిగా చేరాడు. నమ్మకంగా మెలిగాడు. ఆ తర్వాత హతుడి భార్య ఇంట్లో లేని సమయంలో తన బంధువులను ఫోన్ చేసి రప్పించి చంపేశాడు. ఇంతకీ ఈ దారుణానికి తెగించిన వ్యక్తికి, హతుడికి ఏం సంబంధమనే కదా డౌటు. స్వయానా అతడి తల్లితోనే హతుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అతడి మోజులో పడే చిన్న వయసులో ఉన్న అతడిని భర్త వద్దే వదిలేసి ప్రియుడితో కలిసి వచ్చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పంజాబ్ రాష్ట్రానికి చెందిన సద్‌నామ్‌సింగ్ అనే వ్యక్తికి పెళ్లి కాలేదు. తన సొంత అన్న భార్య బల్జీత్ కౌర్ తో అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వదిన అనే వావీ వరసలు మరచి అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. ఈ విషయం బయటపడటంతో తనకు అప్పటికే ఓ కొడుకు నిషాంత్ సింగ్ ఉన్నా అతడిని భర్త వద్దే వదిలేసి సద్‌నామ్‌సింగ్ తో ఊళ్లో నుంచి ఎస్కేప్ అయింది. వాళ్లు ఎక్కడకు వెళ్లారో? ఏమయ్యారో ఎంత వెతికినా ఆచూకీ తెలియరాలేదు. దాదాపు పదేళ్ల తర్వాత వాళ్ల ఆచూకీ తెలిసింది. హైదరాబాద్ లో ఉంటూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను నిర్వహిస్తున్నారని తెలిసింది. ఈ పదేళ్ల పాటు తన తండ్రి పడుతున్న ఆవేదనను, అవమానాలను నిషాంత్ కళ్లారా చూశాడు. దీనికి కారణమయిన సద్‌నామ్‌సింగ్ పై పగ తీర్చుకోవాలనుకున్నాడు.
ఇది కూడా చదవండి: ఈ రోజు రాత్రి నా భర్త ఒక్కడే ఇంట్లో ఉంటాడు.. వెళ్లి పని పూర్తి చెయ్.. అంటూ భార్యే అతడికి ఫోన్ చేసి మరీ..
దీనికి పక్కాగా ప్లాన్ వేసుకున్నాడు. ముందుగా హైదరాబాద్ కు వచ్చి వాళ్లు ఉంటున్న ప్రాంతానికి వెళ్లాడు. ఆ జంటకు ఏడేళ్ల వయసున్న కొడుకు కూడా ఉండటాన్ని గమనించాడు. తానెవరో చెప్పి వాళ్లతో పరిచయం పెంచుకున్నాడు. ఏదైనా పని ఉంటే చెప్పమ్మా, ఖాళీగా ఉండటం బదులు ఏదైనా పనిచేసుకుంటా అని నమ్మబలికాడు. వాళ్ల వ్యవహారం అంతా మర్చిపోయినట్టు నాటకమాడాడు. అలా రెండు మూడు సార్లు వాళ్ల వద్దకు వచ్చాడు. చివరగా ఇటీవల మళ్లీ హైదరాబాద్ కు వచ్చి వాళ్ల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనే పనోడిగా చేరాడు. అయితే తన కొడుకు నిషాంత్ అక్కడ పని చేయడం ఆమెకు నచ్చలేదు. దీంతో సద్‌నామ్‌సింగ్‌తో గొడవ పడి బల్జీత్ కౌర్ తన ఏడేళ్ల కొడుకుతో సహా గురుద్వారాకు వెళ్లిపోయింది.
ఇది కూడా చదవండి: గర్భవతి అయినప్పటికీ భర్తతో శృంగారంలో పాల్గొన్న భార్య.. కడుపులో బిడ్డ ఎదుగుదలను చూసేందుకు స్కానింగ్ తీస్తే షాకింగ్ రిజల్ట్
సద్‌నామ్‌సింగ్ ఒక్కడే ఉంటున్నాడని తెలిసిన నిషాంత్ తన బంధువులకు ఫోన్ చేశాడు. పంజాబ్ నుంచి వచ్చిన బంధువుల సాయంతో సద్‌నామ్‌సింగ్‌ను హత్య చేశాడు. శవాన్ని మాయం చేసి హైదరాబాద్ వదిలి వెళ్లిపోయారు. ఏప్రిల్ 1వ తారీఖున ఈ హత్య విషయం బయటపడటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బల్జీత్ కౌర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే కొడుకు నిషాంత్ వ్యవహారం బయటకొచ్చింది. అతడే చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. వాళ్లు కూడా పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Hyderabad, Telangana, Wife kill husband