మన దేశంలో ఆడపిల్లల భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే.. కడుపులోనే చంపేస్తున్నారు. ఈ లోకానికి రాకముందే పైలోకానికి పంపించేస్తున్నారు. వాస్తవానికి మనదేశంలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం నిషేధం ఉంది. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన శిక్షలు విధిస్తారు. ఐనప్పటికీ కొందరు డాక్టర్లు కాసుల కక్కుర్తితో చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. పరీక్షల్లో ఆడ పిల్ల పుడుతుందని తెలిస్తే.. కొంత మంది తల్లిదండ్రులు ఆ పిండాన్ని కడుపులోనే చంపేస్తున్నారు. ఆబార్షన్ చేయించుకుంటున్నారు. తాజాగా కర్నాటక (Karnataka)లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడు మృత పిండాలు మురికి కాల్వలో ( 7Aborted Fetuses Found)కనిపించడం తీవ్ర కలకలం రేపింది.
Wife escape with lover :పెళ్లి అయిన 8 రోజులకే..భర్తను ఎర్రి పుష్పం చేసి ప్రియుడితో జంప్
బెల్గావి జిల్లాలోని మూదలగి పట్టణ శివారులో ఏడుగురు శిశువుల మృత పిండాలు లభ్యమయ్యాయి. మూదలగి బస్టాప్‌కు కొద్ది దూరంలోని మురికి కాలువలో ఓ డబ్బాలో పిండాలు కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు మృత పిండాలను డబ్బాలో పెట్టి... కాలువలో విసిరేసి వెళ్లిపోయారు. కొందరు స్థానికులు ఆ డబ్బాను గమనించి.. తిరిచి చూశారు. అందులో మృత పిండాల అవశేషాలు ఉండడంతో షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి... ఆ డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. ఆ మృత పిండాలన్నీ 5 నుంచి 7 నెలల వయసు ఉన్నవిగా పోలీసులు గుర్తించారు. పరీక్షల కోసం వాటిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మాట్లాడిన జిల్లా వైద్యాధికారి డా.మహేష్ కోని.. పిండాలకు లింగ నిర్ధారణ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అందుకోసం వాటిని బెల్గావి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపిస్తామని తెలిపారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అటు జిల్లా వైద్యాధికారులు కూడా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. డబ్బాలో లభ్యమైన ఉన్న మృత పిండాలు ఆడ శిశువులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఏదైనా ప్రైవేట్ ఆసుత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఉంటారని..పరీక్షల్లో ఆడపిల్లలని తేలడంతో.. అబార్షన్ చేసి తొలగించి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి.. ఓ స్థానిక మెటర్నిటీ క్లినిక్‌ను అధికారులు సీజ్ చేశారు. డాక్టర్లతో పాటు అందులో పనిచేసే సిబ్బందిని అదుపులోకి విచారిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు విచారణ జరుపుతున్నారు. బెలగావి జిల్లాలో ఇలా పిండాలు బయటపడటం ఇదే మొదటిసారి కాదు. 2013లో కూడా ఒకేసారి 13 పిండాలు బయటపడ్డాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Karnataka