హోమ్ /వార్తలు /క్రైమ్ /

నెల్లూరులో TikTok స్టార్ రఫీ ఆత్మహత్యకు అసలు కారణమిదే.. ఓ ఫ్రెండ్ లవర్ తో..

నెల్లూరులో TikTok స్టార్ రఫీ ఆత్మహత్యకు అసలు కారణమిదే.. ఓ ఫ్రెండ్ లవర్ తో..

రఫీ ఆత్మహత్యకు ప్రాణంగా నమ్మిన స్నేహితుడే కారణమని తెలుస్తోంది. అతడి వేధింపులను భరించలేకే రఫీ ఈ దారుణానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఓ యువతి కారణంగానే ఆ ఇద్దరు స్నేహితుల మధ్య విబేధాలు వచ్చాయని పోలీస్ కేసు కూడా నమోదయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ఇంకా చదవండి ...

  నెల్లూరు జిల్లాలో టిక్ టాక్ (TikTok) స్టార్ రఫీ జనవరి 22న శుక్రవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు గుర్తించి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లినా, అప్పటికే రఫీ చనిపోయాడని వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అతడి ఆత్మహత్యకు కారణాలేంటన్న దానిపై ఆరా తీస్తున్నారు. అతడి ఫోన్ కాల్స్, అతడి స్నేహితుల లిస్ట్ ను మొత్తం పరిశీలిస్తున్నారు. అయితే రఫీ ఆత్మహత్యకు ప్రాణంగా నమ్మిన స్నేహితుడే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. అతడి వేధింపులను భరించలేకే రఫీ ఈ దారుణానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఓ యువతి కారణంగానే ఆ ఇద్దరు స్నేహితుల మధ్య విబేధాలు వచ్చాయని పోలీస్ కేసు కూడా నమోదయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

  నెల్లూరు జిల్లా రంగనాయుల పేట పెద్దతోట ప్రాంతంలో రియాజ్ భాషా చిన్న కుమారుడు 23 ఏళ్ల రఫీ ఈవెంట్స్ కు ఫొటో గ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. నారాయణరెడ్డి ప్రాంతానికి చెందిన ముస్తాఫా, రఫీకి ప్రాణ స్నేహితుడు. ఇద్దరూ కలిసే టిక్ టాక్ వీడియోలను చేసుకునేవారు. సోషల్ మీడియాలో ఫేమస్ కూడా అయ్యారు. ఇదే క్రమంలో ముస్తాఫాకు ఓ యువతితో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వాళ్లిద్దరి విషయం రఫీకి కూడా తెలుసు. అయితే ఆ యువతి కొద్ది రోజులుగా రఫీతో కూడా సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది. రఫీతో తన ప్రేయసి అంత చనువుగా ఉండటాన్ని ముస్తాఫా తట్టుకోలేకపోయాడు. దీంతో వారిద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. ఇదే విషయమై పలుమార్లు గొడవ కూడా పడ్డారు. ఈక్రమంలోనే జనవరి 20వ తారీఖున రఫీ, ఆ యువతి కలిసి మనుబోలుకు వెళ్లారు. ఈ విషయం ముస్తఫాకు తెలిసింది.

  ప్రేయసికి ఫోన్ చేసి ఎక్కడున్నావంటూ అడిగాడు. తాను రఫీతో కలిసి మనుబోలులో టీ తాగుతున్నానని ఆ యువతి చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి నాల్గవ మైలు దగ్గరకు రావాలని చెప్పాడు. ఇటీవల జరిగిన ఈవెంట్ కు సంబంధించిన డబ్బు ఇవ్వాల్సి ఉండటంతో అది ఇస్తాడేమోనని రఫీ ఆ యువతితో కలిసి ముస్తఫా చెప్పిన చోటుకు వెళ్లాడు. అక్కడకు రాగాను ముస్తఫా రఫీతో గొడవ పడి తీవ్రంగా కొట్టాడు. తీవ్రగాయాలతోనే రఫీ ఇంటికి చేరుకున్నాడు. రఫీ తండ్రి అతడిని ఆసుపత్రిలో చేర్పించి విషయం తెలుసుకుని ముస్తాఫాపై 21వ తేదీన నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు.

  అయితే తనపై కేసు పెట్టారని తెలుసుకున్న ముస్తాఫా, రఫీకి ఫోన్ చేశాడు. పోలీస్ కేసును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. రఫీకి సంబంధించిన కొన్ని ప్రైవేటు వీడియోలు ముస్తాఫా వద్ద ఉన్నాయి. వాటి గురించి చెప్తూ, కేసు వెనక్కు తీసుకోకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని ముస్తఫా బెదిరించాడు. దీంతో తీవ్ర కలత చెందిన రఫీ జనవరి 22న ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  First published:

  Tags: Crime news, Crime story, Tik tok, Viral Video

  ఉత్తమ కథలు