ఆ పనికి అడ్డుగా ఉన్నారని, కన్నబిడ్డలను కారులో పెట్టి లాక్ చేసిన తల్లి...

5 ఏళ్ల లోపు ఐదుగురు చిన్నారులను కారులో వదిలేసి, బార్‌కి వెళ్లిన తల్లి... సమయానికి తండ్రి రావడంతో పిల్లలకు తప్పిన ప్రాణాపాయం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 29, 2019, 9:03 PM IST
ఆ పనికి అడ్డుగా ఉన్నారని, కన్నబిడ్డలను కారులో పెట్టి లాక్ చేసిన తల్లి...
ఆ పనికి అడ్డుగా ఉన్నారని, కన్నబిడ్డలకు కారులో పెట్టి లాక్ చేసిన తల్లి..
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 29, 2019, 9:03 PM IST
కనిపించని ఆ దేవుడి కంటే కనిపెంచే కన్నతల్లి దైవంగా భావిస్తారు చాలామంది. బిడ్డల సంతోషం కోసం ఎన్ని బాధలైనా ఆనందంగా భరిస్తూ, మాతృత్వాన్ని పంచుతుంది తల్లి. అయితే ఓ తల్లి మాత్రం మందు కొట్టాడానికి అడ్డుగా ఉన్నారని చెప్పి, కన్నబిడ్డలను కారులో పెట్టి లాక్ చేసింది. ఐదుగురు పిల్లలను కారులో వదిలేసి, బార్‌లోకి వెళ్లి ఫుల్లుగా మందేసింది. బిడ్డల తండ్రిని కూడా షాక్‌కు గురి చేసిన ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. ఫ్లోరిడాలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఓ చిన్నకంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్యాపిల్లలను ఇంటి దగ్గర వదిలి, ఉద్యోగానికి వెళ్లేవాడు. ఐదుగురు పిల్లలను వదిలి, పుట్టింట్లో వదిలి వస్తానని భార్య చెప్పడంతో సరేనని ఉద్యోగానికి వెళ్లాడు. రాత్రి ఇంటికొచ్చిన తర్వాత ఇంట్లో భార్య కూడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి, ఆమెకు ఫోన్ చేశాడు. ఎంత ఫోన్ చేసినా ఆమె ఎత్తలేదు.

దాంతో కంగారుపడి మళ్లీ ఫోన్ చేస్తూనే ఉన్నాడు. చాలాసేపటి తర్వాత కూతురు ఫోన్ ఎత్తింది. ఎక్కుడున్నారని అడడగా... మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్ ముందు ఉన్నామని చెప్పింది. తమను కారులో ఉంచి, అమ్మ షాపులోకి వెళ్లిందని చెప్పింది. రెస్టారెంట్‌కు వెళితే, పిల్లలను లోపలికి తీసుకెళ్లకుండా తాను మాత్రమే లోపలికి ఎందుకు వెళ్లిందా? అని అతనికి అనుమానం వచ్చింది. పిల్లలను వెతుక్కుంటూ బయలుదేరాడు. చాలాసేపటికి ఓ బార్ ముందు పిల్లల కారు కనిపించింది. వెళ్లి చూడగా... కారులో పిల్లలను పెట్టి, లాక్ వేసి వెళ్లింది అతని భార్య. బార్‌లోకి వెళ్లి చూడగా ఫుల్లుగా తాగిన వారి తల్లి, మత్తుగా పడుకుని ఉంది. కారు లాక్ కోసం వెతకినా కనిపించలేదు. ఏం చేయాలో తెలియక వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి, పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పిల్లలను బయటికి తీసి రక్షించారు. కారులో ఉన్నవారంతా 5 ఏళ్ల లోపు చిన్నారులే కావడం విశేషం. 5 ఏళ్ల పెద్ద కూతురు, 3 ఏళ్ల పెద్ద కొడుకు, 14 నెలల చిన్నారి, 20 రోజుల వయసున్న ఇద్దరు కవలలు కావడం విశేషం. పిల్లలను నిర్లక్ష్యంగా వదిలేసి, మందుకొట్టడానికి వెళ్లిన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు భర్త. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

First published: March 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...