కొండచిలువను ప్యాంటులోపల పెట్టుకుని... ఎంచక్కా ఎత్తుకెళ్లాడు...

పాము కనిపించకపోవడంతో షాక్‌కు గురైన షాపు నిర్వాహకుడు... అనుమానంతో సీసీటీవీ ఫుటేజ్ చూసి షాక్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 30, 2019, 1:51 PM IST
కొండచిలువను ప్యాంటులోపల పెట్టుకుని... ఎంచక్కా ఎత్తుకెళ్లాడు...
కొండచిలువను ప్యాంటులోపల పెట్టుకుని ఎత్తుకెళ్లాడు...
  • Share this:
పామును చూస్తేనే భయంతో జడుసుకుని, అల్లంత దూరం పరుగెత్తుకుని పోతారు కొంతమంది. కొండచిలువ లాంటి భారీ సర్పాలను దగ్గర్లుంచి చూశారంటే గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతాయి. అలాంటిది ఓ కొండచిలువను ప్యాంటులోపల పెట్టుకుని ఎత్తుకెళ్లాడో ప్రబుద్ధుడు. సంఘటన జరిగిన తర్వాత సీసీటీవీ కెమెరాల్లో చూస్తే... పాము అలా పోయిన విషయం తెలుసుకోలేకపోయాడు సదరు పాము యజమాని. అమెరికాలోని మిచిగాన్ ఏరియాలో ఓ వ్యక్తి పాములకు సంబంధించి దుకాణం పెట్టాడు. అందులో రకరకాల పాములు పెట్టి అమ్ముతున్నాడు. ఇక కోళ్లు, పక్షులు, చేపలు పెట్టి అమ్మడం ఎంత సాధారణమో, అక్కడ ఇలాంటి పాములను అమ్మడమూ అంతే సాధారణం. అయితే షాపులో పాములను కొనేందుకు వచ్చిన ఓ వ్యక్తికి ఓ తెల్ల కొండచిలువ బాగా నచ్చేసింది. ఎంతో క్యూట్‌గా ఉన్న ఆ వైట్ పైథాన్‌ను ఎలాగైనా కొనుక్కోవాలని అనుకున్నాడు.

కానీ దాని ధర చూస్తే భారీగా ఉంది. అంతే పామును కొట్టేయాలని అనుకున్నాడు. గ్లాస్‌లో నుంచి తీసి, ప్యాంటులోపల దాచేశారు. తర్వాత ఎంచక్కా బయటికి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయిన తర్వాత పాము కనిపించకపోవడంతో షాక్‌కు గురైన షాపు నిర్వాహకుడు... అనుమానంతో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాడు. అందులో అతను చేసి పనిని చూసి, షాక్‌కు గురయ్యాడు. పాము ఎంత నచ్చితే మాత్రం, అలా ప్యాంటులోపల పెట్టుకుని వెళ్లిపోయాడేంటబ్బా... అని ఆశ్చర్యపోయి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిజానికి ఆ పాము అమ్మకానికి పెట్టినప్పటికీ దాన్ని ఒకరోజు ముందే వేరే చోటు నుంచి అక్కడికి తెచ్చారట. భారీధరకు ఎవ్వరూ దాన్ని కొనలేకపోతే వేరే చోటుకు తరలించాల్సి ఉందట. ఈలోపు కొండచిలువను కొట్టేశాడు సదరు సర్ప ప్రేమికుడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సదరు వ్యక్తి కోసం గాలిస్తున్నారు పోలీసులు.

First published: March 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading