14 ఏళ్ల కూతురిపై కన్నతండ్రి అత్యాచారం... మత్తు దిగిన తర్వాత పశ్చాతాపంతో...

మద్యం మత్తులో కన్నకూతురి గొంతుపై కత్తి పెట్టి అత్యాచారం... మత్తు దిగాక తాను చేసిన తప్పు తెలుసుకుని ప్రశ్చాతాపం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 20, 2019, 9:32 PM IST
14 ఏళ్ల కూతురిపై కన్నతండ్రి అత్యాచారం... మత్తు దిగిన తర్వాత పశ్చాతాపంతో...
14 ఏళ్ల కూతురిపై కన్నతండ్రి అత్యాచారం... తర్వాత పశ్చాతాపంతో
  • Share this:
మానవత్వం మరిచి కన్నకూతురిపై అత్యంత పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డాడో తండ్రి. ఆ తర్వాత తాను చేసిన తప్పు గ్రహించి ప్రశ్చాతాపంతో ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌ సమీపంలో వెలుగుచూసింది. ప్రతాప్‌ఘర్ జిల్లాలోని సిహద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి... తన 14 ఏళ్ల కూతురితో కలిసి వంటకి కావల్సిన కట్టెలు తీసుకురావడానికి అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత తనతో తెచ్చుకున్న మద్యం సేవించాడు. ఫుల్లుగా తాగిన తర్వాత మత్తులో ఒళ్లు మరిచిపోయిన అతను... తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి చేసే నీచమైన పనిని అడ్డుకునేందుకు ఎంతగానో ప్రయత్నించింది. దాంతో కత్తిని బాలిక గొంతుపై పెట్టి, బెదిరించి కన్నకూతుర్ని దారుణంగా రేప్ చేశాడు ఆ తాగుబోతు. ఇంటికి చేరిన తర్వాత బాలిక, తన తల్లికి జరిగిన సంగతి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కన్నకూతురిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిన వెంటనే ఆమె కోపంతో ఊగిపోయింది. భర్తను తిట్టి, కొట్టి... చుట్టుపక్కల వాళ్లను తీసుకొచ్చి అతనికి దేహశుద్ది చేయించాలనుకుంది. తన అన్న దగ్గరికి వెళ్లి విషయం చెప్పిన ఆమె... అతని సాయంతో పోలీసులకు సమాచారం అందించింది. అయితే అప్పటికే మద్యం మత్తు దిగిన అతను... అక్కడి నుంచి పారిపోయాడు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు... బాలిక తండ్రి కోసం గాలింపు చర్యలు మొదలెట్టారు. అయితే మద్యం మత్తు దిగిన తర్వాత కూతురిపై తాను చేసిన నీచమైన పనిని తెలుసుకున్న అతను... తాను చేసిన పనిని తట్టుకోలేకపోయాడు.

తన భార్యకూ, కన్నకూతురికి, బంధువులకు మొహం ఎలా చూపించాలో తెలియక... రెండు రోజుల పాటు అడవిలో తిరిగాడు. ఆ తర్వాత గ్రామానికి తిరిగి వచ్చి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తలుపులు తెరిచి చూడగా భర్త ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించిందామె. అత్యాచారం కేసుతో పాటు ఆత్మహత్య కేసును కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
First published: May 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading