Home /News /crime /

SHOCKING MAN BEATS CA WIFE FOR NOT HANDING OVER HER SALARY IN GUJARAT SU

చార్టర్డ్ అకౌంటెంట్‌గా మంచి ఉద్యోగం.. మూడేళ్ల క్రితం పెళ్లి.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆమె 27 ఏళ్లు.. చార్టర్డ్ అకౌంటెంట్‌గా జాబ్ చేస్తోంది. మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. కానీ తన జీవితం ఇలా అవుతుందని ఊహించలేకపోయింది.

    ఆమె 27 ఏళ్లు.. చార్టర్డ్ అకౌంటెంట్‌గా జాబ్ చేస్తోంది. మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. కానీ తన జీవితం ఇలా అవుతుందని ఊహించలేకపోయింది. పెళ్లైనా కొద్దిరోజులకే అతని అసలు రూపం వెలుగుచూసింది. కేవలం ఆమెకు వచ్చే జీతం కోసం అతడు పెళ్లిచేసుకున్నట్టుగా తెలిసింది. జీతం మొత్తం తనకే ఇవ్వాలని ఆమెను కొట్టడం చేసేవాడు. అంతేకాకుండా ఆమె తల్లిదండ్రులను (Parents) కూడా అవమానించాడు. దీంతో చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన గుజరాత్‌లో(Gujarat) చోటుచేసుకుంది. వివరాలు.. అహ్మదాబాద్‌లోని నానా చిలోడా ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి.. చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. ఆమె 2018 ఆగస్టులో ఆమెకు నానా చిలోడా ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అతడు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి జరిగిన కొన్ని రోజులకే మహిళకు వచ్చే మొత్తం జీతం తనకు ఇవ్వాల్సిందిగా ఆమె భర్త చెప్పాడు.

    ఇక, 2019 జనవరిలో వారిద్దరు ఉద్యోగం కోసం ఆఫ్రికాలోని బోట్స్‌వానా(Botswana) ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కూడా డబ్బులు కోసం మహిళను ఆమె భర్త తరుచూ కొట్టేవాడు. ఇక, ఈ జంట ఈ ఏడాది సెప్టెంబర్‌లో తిరిగి ఇండియాకు వచ్చింది. అయినప్పటికీ.. మహిళ భర్త ఆమెను డబ్బుల కోసం వేధించేవాడు. సోమవారం మహిళ తల్లిదండ్రులు ఆమెను చూసేందుకు వస్తే.. వారిని ఆమె భర్త అవమానించాడు. మళ్లీ తన ఇంటికి రావద్దని చెప్పాడు. దీంతో ఆమె భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం ఆమె ఇందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు (Police Compalint) చేసింది. తన భర్త హింసిస్తున్నాడని, దాడులు చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.

    ప్రైవేటు కంపెనీలో మంచి ఉద్యోగం.. బ్యాంక్ వెళ్తున్నానని బయటకు వెళ్లింది.. కట్ చేస్తే..

    ‘నేను సగం జీతం అతనికి ఇస్తే.. అతడు నన్ను కొట్టేవాడు. నన్ను కేవలం జీతం కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నానని చెప్పేవాడు. జీతం మొత్తం (Total salary) అతడికి ఇవ్వకపోతే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించేవాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని అనేవాడు. బోట్స్‌వానాలో చంపేసిన సాయం చేసేందుకు ఎవరూ రారని బెదిరించేవాడు’ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Domestic Violence, Gujarat

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు