బర్త్ డే కేక్ ఆర్డర్ చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..

తనిఖీలకు వెళ్లిన అధికారులు కొన్ని బేకరీలు,గోదాముల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా తత్తనేరిలోని ఓ గోదాములో కుళ్లిన కోడి గుడ్లను పెద్ద ఎత్తున స్టోర్ చేయడం గుర్తించారు.

news18-telugu
Updated: July 11, 2019, 7:33 AM IST
బర్త్ డే కేక్ ఆర్డర్ చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బర్త్ డేలకు.. ఇతరత్రా పార్టీలకు.. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం ఈరోజుల్లో చాలా కామన్.అయితే ఇదే అదనుగా కొంతమంది దందా రాయుళ్లు.. కల్తీ కేకులను తయారు చేయడం మొదలుపెట్టారు. కల్తీ కేకులు ఏంటి అనుకుంటున్నారా..? అవును.. కుళ్లిపోయిన కోడిగుడ్లతో కేకులు తయారుచేస్తున్న ఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే.. కుళ్లిన కోడిగుడ్లతో కేకులు తయారుచేస్తున్నారని మధురై అధికారులకు ఇటీవల ఫిర్యాదులు అందాయి. దీంతో తనిఖీలకు వెళ్లిన అధికారులు కొన్ని బేకరీలు,గోదాముల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా తత్తనేరిలోని ఓ గోదాములో కుళ్లిన కోడి గుడ్లను పెద్ద ఎత్తున స్టోర్ చేయడం గుర్తించారు. ఒక్కో గుడ్డును కేవలం రూ.1కే విక్రయిస్తుండటంతో.. పలువురు బేకరీ షాపుల యజమానులు వాటిని తీసుకెళ్లి కేకు తయారీలో వాడుతున్నారు. ఈ దందాను తీవ్రంగా పరిగణించిన పోలీసులు బాధ్యులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుళ్లిన కోడిగుడ్లతో కేకుల తయారీ గురించి తెలియడంతో జనం కేకులు కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు.ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

First published: July 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com