Shocking: ఉపాధి కూలీలైన మహేంద్ర సింగ్ ధోనీ, ఆండ్రూరస్సెల్... కూలి ఎంతంటే...

Shocking: ఉపాధి కూలీలైన మహేంద్ర సింగ్ ధోనీ, ఆండ్రూరస్సెల్... కూలి ఎంతంటే... (File Images)

Shocking: ధోనీ, ఆండ్రూ రస్సెల్ కూలీలు ఎలా అయ్యారు? వేలి ముద్రలు వేసి... ఎలా కూలీ తీసుకున్నారు? వాళ్లిద్దరూ ఈ పనులు ఎక్కడ చేశారు? ఆ చిత్రమేంటో తెలుసుకుందాం.

  • Share this:
    కలలో కూడా మనం ఊహించని ఘటన ఇది. ఇలాంటి నేరాలు కూడా ఈ రోజుల్లో ఈజీగా జరిగిపోతున్నాయి. లేకపోతే... ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్లైన మహేంద్ర సింగ్ ధోనీ, ఆండ్రూ రస్సెల్... ఉపాధి కూలీలు అవ్వడమేంటి... ఈ చిత్రం జరిగింది... తెలంగాణ... కామారెడ్డి జిల్లాలో. మరింత షాకింగ్ ఏంటంటే... వీళ్లిద్దరూ వేలి ముద్రలు వేసి... కూలి డబ్బులు కూడా తీసుకున్నారు. అసలు ఇది ఎలా జరిగింది? క్రికెటర్ల పేరుతో కూలి డబ్బులు ఎలా చేతులు మారాయి అనే డౌట్ రావచ్చు మనకు. కామారెడ్డి జిల్లా పెదకొడప్‌గల్‌ మండలం... వడ్లం గ్రామంలో పొలానికి వెళ్లే దారి అధ్వాన్నంగా మారింది. అధికారులు ఎవ‌రికి చెప్పినా స‌మ‌స్య తీరలేదు. దాంతో మూడు నెలల కిందట కొంద‌రు రైతులు సొంత డ‌బ్బుల‌తో మ‌ట్టి రోడ్డు నిర్మించుకున్నారు. ఆ రోడ్డు వేసేందుకు రూ.7 లక్షలు ఖ‌ర్చుచేశారు.

    mahendra singh dhoni, Andre Russell, employment guarantee scheme, kamareddy district, telangana news, telugu news, telugu varthalu, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, క్రైమ్ న్యూస్, క్రైమ్ వార్తలు,
    Shocking: ఉపాధి కూలీలైన మహేంద్ర సింగ్ ధోనీ, ఆండ్రూరస్సెల్..... (File Images)


    ఇదే ఆదనుగా భావించిన ఉపాధి హామీ సిబ్బంది ఆ రోడ్డును ఉపాధి హామీలో చూపించి... డ‌బ్బులు తమ జేబుల్లో వేసుకోవచ్చని ఓ ప్లాన్ వేశారు. ఎవ‌రికి తెలుస్తుందిలే అనుకున్నారో ఏమో... ఆ రోడ్డు కోసం రూ.21 లక్షలు ఖర్చు చేసినట్లు చూపించి... అడ్డగోలు బిల్లులు సృష్టించారు. వాటిని చూపించి డబ్బు డ్రా చేసుకున్నారు.

    కష్టం తమది... ప్రతిఫలం ఇంకొకరు పొందుతుంటే... ఆ రైతులకు ఒళ్లు మండదా... "ఇంత దుర్మార్గమా... రోడ్డు వెయ్యకపోగా... తాము వేసుకున్న దానికి... డబ్బు కాజేస్తారా... వీళ్ల సంగతి తేల్చాల్సిందే" అనుకున్న రైతులు... ఎలా దొంగల్ని పట్టించాలో ఆలోచించారు. అందరూ కలిసి... రెవెన్యూ అధికారుల దగ్గరకు వెళ్లి... స్కామ్ మొత్తం క్లారిటీగా వివరించి... కంప్లైంట్ ఇచ్చారు. అసలే తెలంగాణలో రెవెన్యూ శాఖలో అవినీతి బాగా జరుగుతోందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ తాజా తంతు ప్రజల్లోకి వెళ్లకముందే దీన్ని ఆపేయాలి అనుకున్న ఆర్డీవో రాజాగౌడ్‌ గ్రామంలో విచారించారు.

    ఉపాధి హమీ పనుల రిజిస్టర్‌‌లో రోడ్డు పనులు ఎవరు చేశారో చూశారు. ధోనీ, ఆండ్రూ ర‌స్సెల్ అనే ఇద్దరు క్రికెటర్లు చేసినట్లుగా పేర్లు ఉన్నాయి. అధికారులు షాక్ అయ్యారు... ఇంకే పేర్లూ లేనట్లు ఈ పేర్లెందుకు రాశారో అనుకుంటూ... ఏం జరిగిందో తెలుసుకున్నారు. క్రికెటర్ల పేర్లు చెప్పి... ఉపాధి హామీ సిబ్బంది... డబ్బు కాజేశారు అర్థమైంది. కూలీ డ‌బ్బులు పొందేందుకు వేసిన వేలి ముద్రలు కూడా సిబ్బందివేనని తేలింది. దీనిపై కలెక్టర్‌కు నివేదిక‌ ఇచ్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆర్డీవో తెలిపారు.

    ఇది కూడా చదవండి: Summer Tips: ఇంట్లో వేడిని ఇలా తగ్గించుకోండి... సింపుల్ టిప్స్

    ఇదీ మ్యాటర్. ఇలా ఎలా వీలైతే అలా అక్రమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు. రైతులు అప్రమత్తంగా ఉండటంతో... ఈ భారీ స్కామ్ తెరపైకి వచ్చింది.
    (పి.మహేందర్, న్యూస్18తెలుగు ప్రతినిధి)
    Published by:Krishna Kumar N
    First published: