Crime : డాక్టర్ కాదు.. నరరూప రాక్షసుడు.. బెడ్లు ఖాళీ చేయటానికి పేషెంట్లను చంపిన కిరాతకుడు

ప్రతీకాత్మక చిత్రం

Crime : కరోనా టైంలో వైద్యులు, నర్సులు చేసిన సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలిచి..తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ఎంతో మందిని కాపాడారు. కానీ ఆ డాక్టరే ప్రాణాలు తీసేవాడైతే..! ప్రాణాలు పోయాల్సినవాడే ప్రాణాలు తీసేస్తే..!! అదే జరిగింది కరోనా మహమ్మారి కాలంలో...

  • Share this:
    కరోనా టైంలో వైద్యులు, నర్సులు చేసిన సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలిచి..తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ఎంతో మందిని కాపాడారు. దేవుడు జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మనిస్తాడని..అందుకే డాక్టర్లను దేవుడితో పోలుస్తాం. డాక్టర్ ఎంత డబ్బు ఖర్చు అయినా ఫరవాలేదు. ప్రాణాలు కాపాడండీ డాక్టర్ అని కోరుకుంటాం. పోతే తిరిగి రానిది ప్రాణం ఒక్కటే కాబట్టి. కానీ ఆ డాక్టరే ప్రాణాలు తీసేవాడైతే..! ప్రాణాలు పోయాల్సినవాడే ప్రాణాలు తీసేస్తే..!! అదే జరిగింది కరోనా మహమ్మారి కాలంలో. ఓ డాక్టర్ కరోనా పేషెంట్ల ప్రాణాల్ని అత్యంత దారుణంగా తీసేశాడు. దానికి ఆ డాక్టర్ చెప్పిన కారణం వింటే షాక్ అవ్వటమే కాదు..మైండ్ బ్లాంక్ అయిపోతుంది. హాస్పిటల్ లో బెడ్లు ఖాళీ చేయటానికి సదరు డాక్టర్ కరోనా పేషెంట్ల ప్రాణాలు తీసేసిన ఘటన ఇటలీ లాంబర్డిలోని ఓ ఆస్పత్రిలో కోవిడ్‌ ఎమర్జెన్సీ వార్డులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. డాక్టర్‌ కార్లొ మోస్కా ఇటలీ లాంబర్డిలోని ఓ ఆస్పత్రిలో కోవిడ్‌ ఎమర్జెన్సీ వార్డుకు ఇంచార్జిగా పని చేస్తున్నాడు. అక్కడ బెడ్లు ఖాళీగా లేకపోవడంతో సదరు వైద్యుడు కొందరు పేషెంట్లను చంపేయాలని చూశాడు. ఇందుకు ఎక్కువ వయసున్న వారిని ఎంచుకున్నాడు. 61 ఏళ్ల నటాలే బస్సీ, 80 ఏళ్ల ఏంజెలో పలెట్టి అనే ఇద్దరు కోవిడ్‌ పేషెంట్లకు మత్తుమందుతో పాటు కండరాల నొప్పులకు వాడే మందులను ఎక్కువ డోసులో ఇవ్వడంతో వారు ప్రాణాలు విడిచారు. మార్చిలో చోటు చేసుకున్న ఈ ఘటన మీద పోలీసులు ఇప్పటికీ దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలో సదరు వైద్యుడు, నర్సులతో చేసిన చాటింగ్‌ బయటపడింది.

    అక్కడ బెడ్లు ఖాళీగా లేకపోవడంతో కొందరు కరోనా పేషెంట్లను చంపేయాలని నిర్ణయించాడు. అదే విషయాన్ని నర్సులకు చాటింగ్ లో చెప్పాడు. దానికి ఓ నర్సులు " కేవలం బెడ్లు ఖాళీ అవడం కోసం నేనీ పని చేయలేను" " ఇది చాలా మూర్ఖత్వపు చర్య" చాలా దారుణం అని డాక్టర్ ను హెచ్చరించారు. కానీ డాక్టర్ డాక్టర్‌ కార్లొ మోస్కా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. పైగా రోగులకు ఔషధాలిచ్చే సమయంలో నర్సులను బయటకు వెళ్లమని చెప్పినట్లు విచారణలో తేలింది.

    ఈ క్రమంలో అదే ఆస్పత్రిలో మరణించిన మరో ముగ్గురి చావుకు గల కారణాలను కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా పేషెంట్ల ప్రాణాలు తీశాడన్న ఆరోపణలతో ఎమర్జెన్సీ వార్డ్‌కు హెడ్‌గా ఉన్న అతడిని మోంటిచైరి ఆస్పత్రి విధుల నుంచి తొలగించింది. మరోవైపు పోలీసులు అతడిని గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో సదరు వైద్యుడు తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చాడు. ఇవన్నీ నిరాధారమైనవిగా పేర్కొన్నాడు. ప్రాణాలు కాపాడే వాడినే కానీ తీసేవాడిని కానని చెప్పుకొచ్చాడు.
    Published by:Sridhar Reddy
    First published: