50 మంది మహిళలకి వీర్యదానం చేసిన డాక్టర్... 40 ఏళ్ల తర్వాత విషయం వెలుగులోకి...

సంతానలేమి తన దగ్గరికి వచ్చిన ఆడవాళ్లకు వీర్యదానం చేసిన ఫెర్టిలిటీ డాక్టర్... 40 ఏళ్ల తర్వాత వెబ్‌సైట్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఉదంతం... వీర్యదాతకు ఏడాది జైలు శిక్ష విధించిన అధికారులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 20, 2019, 6:57 PM IST
50 మంది మహిళలకి వీర్యదానం చేసిన డాక్టర్... 40 ఏళ్ల తర్వాత విషయం వెలుగులోకి...
వీర్యాన్ని భద్రపరిచే బ్యాంకు (నమూనా చిత్రం)
  • Share this:
వీర్యదానం... రక్తదానం, అన్నదానం లాగే సంతానలేమితో బాధపడే దంపతులకు ఎంతో మేలు చేసే దానం. వీర్యదానం వల్ల సంతానోత్పత్తి కలిగిన బిడ్డలు, వీర్యదానం చేసిన వ్యక్తిని కలగడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఆశ్చర్యకరంగా ఓ 50 మంది వచ్చి, అతన్ని నాన్నా అని పిలవడంతో ఆశ్చర్యపోయాడా వీర్యదాత. అమెరికాలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమెరికాలోని ఇండియానాలో ఉండే ఓ ఫెర్టిలిటీ ఆసుపత్రిలో డాక్టర్ డొనాల్డ్ క్లైన్... సంతానలేమి సమస్యతో తన దగ్గరికి వచ్చిన ఆడవాళ్లకు వీర్యదానం చేసేవాడు. అయితే ఈ విషయం ఆ గ్రహీతలకు కూడా తెలియదు. అలా దాదాపు 50 మంది మహిళలకు వీర్యదానం చేసి, మాతృత్వాన్ని ప్రసాదించాడా డాక్టర్. ఇది జరిగి దాదాపు 40 ఏళ్లు అవుతోంది. 1960 నుంచి 1970ల మధ్య జరిగిన ఈ వీర్యదానం కలిగిన 50 మంది మహిళలకు పుట్టిన పిల్లలు, కాలక్రమేణా ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. దశాబ్దాలు గడిచిపోయాయి. టెక్నాలజీ మారిపోయింది. తాజాగా అమెరికాలో కొన్ని డీఎన్ఏ వెబ్‌సైట్ ద్వారా ఒకే DNA కలిగిన వారందరూ ఓ గ్రూప్‌గా ఏర్పడ్డారు.

50 మందికి ఒకటే డీఏన్ఏ ఎలా ఉందని విచారణ చేయగా... అందరికి పుట్టుకకు కారణం ఒక్కరేనని తేలింది. అయితే ఒక యువతి DNAతో మరో యువతి DNA మ్యాచ్ కాకపోవడంతో తల్లులు వేర్వేరు అయిఉండొచ్చు కానీ తండ్రి ఒక్కరే అయి ఉంటారని అనుమానించారు. అలా అలా 50 మందికి పుట్టుకకు కారణమైన సెర్మ్ డోనర్ డొనాల్డ్ క్లైన్‌ను కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు వీర్యదానం ద్వారా పుట్టిన 50 మంది. తమ అనధికారిక తండ్రికి వెళ్లి కలిశారు కూడా. అయితే తన కోసం వచ్చిన 50 మంది సంతానాన్ని చూసి, డాక్టర్ సంతోషించేలోపే అతనిపై కేసులు నమోదయ్యాయి. వీర్యదానం చేసింది స్వయంగా డాక్టర్ అని తెలిసి పిల్లల తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఎవరో దాత నుంచి వీర్యాన్ని సేకరించి, సర్జరీ ద్వారా సంతానోత్పత్తి చేశారనుకున్నామని, అతనే ఇలా చేస్తాడనుకోలేదని వాపోయారు వారంతా. నేరానికి పాల్పడిన ఫెర్టిలిటీ డాక్టర్‌కు ఏడాది జైలుశిక్ష విధించారు అధికారులు. 50 మంది డీఎన్ఏ పరీక్షలు చేసుకోవడం ద్వారా అతని సంతానం అని తెలిసినప్పటికీ, తెలియని వారు చాలామందే ఉంటారని అనుమానిస్తున్నారు అధికారులు. డాక్టర్ వీర్యదానం ద్వారా పుట్టిన సంతానం ఎంతమంది అయ్యుంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

First published: March 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading