ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసి, చంపేసిన అన్న...

బంధువుల ఇంటికి వెళుతూ పిల్లలను ఒంటరిగా వదిలివెళ్లిన తల్లిదండ్రులు... వచ్చేసరికి చెరుకుతోటలో శవమై కనిపించిన బాలిక...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 11, 2019, 10:11 PM IST
ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసి, చంపేసిన అన్న...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అన్యం పుణ్యం ఎరుగని ఐదేళ్ల పసికందును అత్యంత అమానవీయంగా అత్యాచారం చేసిన ఓ యువకుడు... ఆ తర్వాత ఆమెను చంపేశాడు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన యూపీ రాష్ట్రంలోని ఘజియాబాద్ సమీపంలో వెలుగుచేసింది. ఘజియాబాద్ ఏరియా దగ్గర్లోని పూరీ కాలనీలో నివాసం ఉంటున్న ఓ ఐదేళ్ల చిన్నారి... ఇంటి ముందు ఆడుకుంటూ ఉంది. బాలిక తల్లిదండ్రులు బంధువుల దగ్గరకు వెళుతూ పిల్లలను ఇంటి దగ్గరే ఆడుకొమ్మని చెప్పి వెళ్లారు. ఇంటికి వచ్చే సరికి చిన్నారి... శరణ గ్రామ సమీపంలో ఉన్న చెరుకుతోటలో శవమై కనిపించింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని చూసి, కామంతో కళ్లు మూసుకుపోయిన మహాజన్ అనే యువకుడు... ఆమెను ఇంటికి పిలిచాడు.

వరుసకు అన్న అయ్యే మహాజన్ పిలవడంతో వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లింది ఐదేళ్ల బాలిక. మహాజన్ ఇంట్లో కూడా ఎవ్వరూ లేకపోవడంతో బాలికను లోపలికి తీసుకెళ్లి, అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత విషయం తెలిస్తే తాను జైలుకి వెళ్లాల్సి వస్తుందని భయపడి ఆమెను అతికిరాతకంగా చంపేశాడు. తర్వాత తన శవాన్ని మూటకట్టి, బైక్‌పై తీసుకెళ్లి శరణ గ్రామశివారులో ఉన్న చెరుకుతోటలోకి విసిరేశాడు. తర్వాత ఏమీ ఎరగనట్టుగా ఇంటికి వచ్చాడు. పొలంలోకి వెళ్లిన రైతు, చిన్నారి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు... సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేయగా మహాజన్ చేసిన దారుణం తెలిసింది. మహాజన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... అతనిపై సెక్షన్ 364, 376, 302తో పోస్కో చట్టం కింద కేసులు నమోదుచేశారు.
First published: April 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading