యూపీలో దారుణం... వరకట్నం కోసం గర్భవతికి గుండు...

గర్భవతి అనే కనీస కనికరం లేకుండా గుండు కొట్టించి, స్వగ్రామం పొలిమేరల్లో వదిలిపెట్టి వెళ్లిన అత్తింటివాళ్లు... పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి తండ్రి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 20, 2018, 3:37 PM IST
యూపీలో దారుణం... వరకట్నం కోసం గర్భవతికి గుండు...
నమూనా చిత్రం
  • Share this:
సోషల్ మీడియా ప్రపంచం విస్తిరించి, హైటెక్ హంగులు పులుముకున్న నేటి సమాజంలోనూ మహిళకు రక్షణ కరువైన సంగతి తెలిసిందే. పని చేసే చోట రక్షణ కావాలంటూ ‘మీటూ’ మూమెంట్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇదిలా ఉండగా ఎన్నో ఏళ్లుగా మహిళలను పట్టిపీడుస్తున్న వరకట్న సమస్య, ఇప్పటికీ అలాగే ఉందని నిరూపిస్తోంది తాజా సంఘటన. అడిగినంత కట్నం తీసుకురాలేదనే కోపంతో గర్భవతి అని కూడ చూడకుండా ఓ మహిళకు గుండు కొట్టించారు అత్తింటివాళ్లు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఉత్తరప్రదేశ్‌లోని హథారస్ ఏరియాకు చెందిన ఓ మహిళకు, నాలుగేళ్ల క్రితం అలీగఢ్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే పెళ్లికి ముందు వరకట్నం గురించి పెద్దగా పట్టించుకోని అతను, అతని కుటుంబం వివాహమైన కొద్దిరోజులకు పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని వేధించడం మొదలెట్టారు. నాలుగేళ్లుగా అత్తింటివారి వేధింపులను భరిస్తూ, మౌనంగా ఉంటూ వచ్చింది ఆ ఇల్లాలు. అయితే కొన్నాళ్ల క్రితం గర్భం దాల్చిన ఆమెకు గుండు కొట్టించి, స్వగ్రామంలో వదిలిపెట్టి వెళ్లారు అత్తింటివాళ్లు. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గర్భిణి అనే కనీస కనికరం లేకుండా అతి దారుణంగా కొట్టి, గుండు కొట్టించి గ్రామ సరిహద్దుల్లో విడిచిపెట్టి వెళ్లారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు ఆమె తండ్రి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.First published: November 20, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>