13 ఏళ్ల చిన్నోడితో హనీమూన్‌‌కు వెళ్లి... తనతో ఖర్చుపెట్టించాడనే కోపంతో...

సోషల్ మీడియా పరిచయంతోనే పెళ్లిదాకా వెళ్లిన యువతి... ఘనంగా పెళ్లి చేసుకుని హనీమూన్‌కు ఏర్పాట్లు... భర్త ఎక్కడా రూపాయి కూడా తీయకపోవడంతో మనస్థాపం చెంది...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 14, 2019, 8:38 PM IST
13 ఏళ్ల చిన్నోడితో హనీమూన్‌‌కు వెళ్లి... తనతో ఖర్చుపెట్టించాడనే కోపంతో...
హనీమూన్‌లో ఉండగానే విడాకుల కోసం దరఖాస్తు... భర్త తన డబ్బులు ఖర్చుచేయించాడని...
  • Share this:
కొందరు మహిళలు ఏం చేసినా భరిస్తారు కానీ తనతో ఖర్చు పెట్టేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. తాజాగా దుబాయ్‌లో వెలుగుచూసిన సంఘటన గురించి తెలిస్తే ఈ విషయం కచ్ఛితంగా ఒప్పుకుంటారు. దుబాయ్‌కు చెందిన ఓ మహిళ, సోషల్ మీడియాలో పరిచయమైన ఓ యువకుడిని ప్రేమించింది. తన కంటే 13 ఏళ్లు చిన్నవాడైన పర్లేదని అతనితో రేయిపగళ్లు ఛాటింగ్ చేసింది. కుర్రాడు తెగ నచ్చేయడంతో అతిథులందరి పిలిచి, ఘనంగా పెళ్లి కూడా చేసుకున్నారు. తర్వాత హనీమూన్‌కి వెళ్లారు. అయితే హనీమూన్‌కు వెళ్లిన తర్వాతి రోజే ఆమె విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. హనీమూన్‌కు వెళ్లిన తర్వాతి రోజే విడాకుల కోసం దరఖాస్తు రావడంతో న్యాయమూర్తులు షాక్‌కు గురయ్యారు. అసలేం జరిగిందమ్మా అని నిలదీయగా... ఆమె చెప్పిన సమాధానం విని, షాక్‌కు గురయ్యారు. భర్త పద్ధతి తనకేమీ నచ్చడం లేదని చెప్పిన ఆమె... పెళ్లి ఖర్చులు మొత్తం తానే భరించానని వాపోయింది.

కనీసం హనీమూన్ సమయంలోనైనా డబ్బులు తీస్తాడేమో అనుకుంటే... అక్కడ కూడా అన్నీ తానే భరించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. రిసార్ట్ బుకింగ్ దగ్గర్నుంచి, కరెంటు, నీటి, ఫుడ్డు బిల్లులు... అన్నీ తానే చెల్లించానని చెప్పింది. తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు అన్నీ తానే చేసుకోవాల్సి వస్తోందని... డేటింగ్ వారకైతే ఓకే కానీ జీవితాంతం అతన్ని భరించడం తనవల్ల కాదని చేతులు ఎత్తేసింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

First published: April 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>