ప్రియుడిని చంపి, ముక్కలుగా నరికి... కుక్కర్‌లో ఉడికించిన యువతి... వాసన రావడంతో...

దుబాయ్‌లో దారుణ సంఘటన... ప్రియుడిని చంపి, పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ముక్కలు చేసి... మాంసాన్ని ఉడికించిన మహిళ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 13, 2019, 8:45 PM IST
ప్రియుడిని చంపి, ముక్కలుగా నరికి... కుక్కర్‌లో ఉడికించిన యువతి... వాసన రావడంతో...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 13, 2019, 8:45 PM IST
ఆమెకు అప్పటికే పెళ్లయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు. కానీ తనకంటే చిన్నోడైన వ్యక్తిపై మోజు పడింది. కొన్నాళ్లు కలిసి సహజీవనం కూడా చేసింది. అయితే ఏమైందో ఏమో అతన్ని చంపేసింది. ముక్కలుగా ముక్కలుగా నరికేసింది. దొరికిపోతానేమోననే భయంతో అతని మాంసాన్ని కుక్కర్‌లో వేసి ఉడికించింది. పక్కింట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు చుట్టుపక్కలవాళ్లు. ఫిర్యాదు తీసుకుని అక్కడ చెక్ చేసిన పోలీసులు...ఆ ఇంట్లో కనిపించిన దృశ్యాలు చూసి షాక్‌కు గురయ్యారు. మొరాకోకు చెందిన 37 ఏళ్ల మహిళ... పదేళ్ల క్రితం దుబాయ్‌కి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత తమ దేశస్థుడైన ఓ 29 ఏళ్ల యువకుడితో ఆమె పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉంటూ సహజీవనం చేయడం మొదలెట్టారు. అయితే అప్పటికే సదరు మహిళకు పెళ్లయ్యిందని, పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకున్న సదరు యువకుడికీ తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కోపంతో తీవ్ర ఆవేశానికి లోనైన ఆమె... తన ప్రియుడిని చంపేసింది. అతని శవాన్ని ఏం చేయాలో తెలియక మూడు ముక్కలుగా కోసి... కుక్కర్‌లో పెట్టి ఉడికించింది. దీంతో పక్కింట్లో ఉన్న మహిళకు దుర్వాసన వచ్చింది. వెంటనే వాచ్‌మెన్‌కు ఫిర్యాదు చేసింది. అతను ఏం జరిగిందని అడగగా ఎండు చేపలను కొన్నానని, అవి చెడిపోయాయని చెప్పింది. పాడైపోయిన చేపలను డస్ట్‌బిన్‌లో పడేసినా కంపు కొడుతోందని చెప్పింది. అయితే రెండు, మూడు రోజుల తర్వాత కూడా వాసన వస్తుండడం, ఇంకా పెరగడంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది పక్కింటి మహిళ. ఆమె ఫిర్యాదు నమోదుచేసుకుని ఆ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు ఉడకబెట్టిన మనిషి మాంసం కనిపించింది. ఆ వాసనకు పోలీసులు సైతం ఇబ్బంది పడి, ముక్కులు మూసుకోగా... అదే ఇంట్లో సదరు యువతి మాత్రం స్వేచ్ఛగా తిరగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

First published: February 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...