బీచ్‌లో అందరూ చూస్తుండగా అది కావాలన్న భర్త... కాదన్న భార్యపై దాడి చేసి...

బీచ్‌లో అందరి ముందు శృంగారం చేయాలనే కోరిక... భార్య ఒప్పుకోకపోవడంతో విచక్షణారహితంగా దాడి చేసి అత్యాచారం, ఆపై హత్య...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 24, 2019, 7:16 PM IST
బీచ్‌లో అందరూ చూస్తుండగా అది కావాలన్న భర్త... కాదన్న భార్యపై దాడి చేసి...
బీచ్‌లో అందరూ చూస్తుండగా అది చేద్దామన్నాడు... కాదన్న భార్యను దారుణంగా...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 24, 2019, 7:16 PM IST
చీకటి గదిలో లేదా నాలుగు గోడల మధ్య ఆ పని చేస్తే ఏం మజా ఉంటుంది... ఆరు బయట, అందరూ చూస్తుండగా, లోకాన్ని పక్కనబెట్టి, సిగ్గు, బిడియం వదిలిపెట్టి శృంగారం చేయాలనుకున్నాడు అతను. తనలో సగమైన తన భార్యతో ఆ విషయం చెప్పాడు. అయితే అందరూ చూస్తుండగా సెక్స్ చేసేందుకు ఆమె ఒప్పుకోలేదు. అంతే... తీవ్ర ఆవేశానికి లోనైన విచక్షణారహితంగా దాడి చేసి, భార్యను చంపేశాడు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన థాయిలాండ్‌లో జరిగింది. 51 ఏళ్ల స్మిథాన్‌కు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. విదేశాల్లో తరుచూ టూర్లకు వెళుతూ, తనను పట్టించుకోవడం మానేశాడని మొదటి భార్య స్మిథాన్‌ను వదిలేసి వెళ్లింది. కొన్నాళ్లు ఒంటరిగానే ఎంజాయ్ చేసిన స్మిథాన్... తర్వాత 29 ఏళ్ల స్మితా అనే ఫిట్‌నెస్ ట్రైయినర్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి సంసార జీవితం కూడా బాగానే సాగింది. వీరికీ ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే భార్యాపిల్లలు ఉన్న తర్వాత కూడా స్మిథాన్... టూర్ల పేరుతో విదేశాలకు చెక్కేసేవాడు. తాను ఎంత తిరుగుతున్నా భార్య ఏమీ అనకపోవడంతో అతనికి అనుమానం వచ్చింది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకే, తాను టూర్లకు వెళ్లేందుకు ఒప్పుకుంటోందని అనుమానించాడు. భార్యను ఈ విషయమై నిలదీశాడు కూడా. అయితే స్మితా మాత్రం భర్త వేసిన ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. దాంతో అతనూ ఏమీ మాట్లాడలేదు.

తాజాగా భార్యను తీసుకుని, సరదాగా థాయిలాండ్ బీచ్‌కు వెళ్లారు స్మిథాన్. అక్కడ ఇద్దరూ కలిసి ఫుల్లుగా మందేశారు. బీచ్‌లో బికినీలో తిరుగుతూ తెగ ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో అందరి ముందు సెక్స్ చేద్దామని భార్యను కోరాడు స్మిథాన్. అయితే అక్కడ అలా ఓపెన్ అవ్వడానికి స్మితా ససేమీరా అంది. కావాలంటే హోటెల్‌లో రూమ్ తీసుకుందామని చెప్పింది. అయితే అలా చేయడం ఇష్టం లేని అతను... భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అతని నుంచి పారిపోతున్న ఆమెను పట్టుకుని, బట్టలు చింపి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు కొట్టి భార్యను చంపేశాడు. తర్వాత శవం మీద ఓ టవల్ కప్పి, వెళ్లిపోయాడు. బీచ్‌లో శవం కనిపించడంతో షాక్‌కు గురైన పర్యాటకులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...