అప్పుడే పుట్టిన బిడ్డను పాతిపెట్టిన తల్లి... చిన్నారిని కాపాడిన కుక్క...

15 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన బాలిక... తల్లిదండ్రులకు విషయం తెలియకుండా ఉండేందుకు పసికందును పూడ్చిపెట్టిన అమ్మాయి... సంఘటనను చూసి చలించిపోయిన శునకం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 18, 2019, 6:00 PM IST
అప్పుడే పుట్టిన బిడ్డను పాతిపెట్టిన తల్లి... చిన్నారిని కాపాడిన కుక్క...
Shocking incident in Thailand, A Dog saves new born baby life, after buried alive by mother అప్పుడే పుట్టిన బిడ్డను పాతిపెట్టిన తల్లి... పసిబిడ్డను కాపాడిన కుక్క... (photo: REUTERS)
  • Share this:
అప్పుడే పుట్టిన పసికందును పాతిపెట్టి కన్నతల్లి కర్కశత్వం ప్రదర్శిస్తే.. ఆ దారుణాన్ని చూసి తల్లడిల్లిన ఓ మూగజీవి... పసిబిడ్డ ప్రాణాలు కాపాడింది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన థాయ్‌లాండ్ దేశంలో వెలుగుచూసింది. థాయిలాండ్‌లోని కొర్టాలోని బాన్ నాంగ్ ఖామ్ అనే గ్రామంలో నివసిస్తున్న ఓ 15 ఏళ్ల బాలిక... తన బాయ్‌ఫ్రెండ్‌తో తొందరపడి గర్భం దాల్చింది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియకుండా దాచి ఉంచింది. అయితే ఆమె బడికి వెళ్లి వచ్చే సమయంలో నొప్పులు మొదలయ్యాయి. మార్గమధ్యంలోనే ప్రసవించిన ఆ బాలిక... విషయం తల్లిదండ్రులకు ఉండాలని సరిగ్గా కళ్లు కూడా తెరవని పసికందును అమానవీయంగా గుంత తవ్వి పూడ్చిపెట్టింది. ఈ సంఘటనను చూస్తూ ఉండిపోయిన ఓ పెంపుడు కుక్క... బాలిక వెళ్లగానే తన కాళ్లతో గుంతను తవ్వి బిడ్డను బయటికి తీసింది. వెంటనే తన యజమాని దగ్గరికి తీసుకెళ్లింది. ‘పింగ్ పాంగ్’ అని పిలుచుకునే తన పెంపుడు కుక్క ఇంటికి హఠాత్తుగా పసిబిడ్డను తేవడం చూసి షాకైన దాని యజమాని... ఆ బిడ్డ వివరాలు తెలుసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముందుగా అతను కూడా పింగ్ పాంగ్ ఎవ్వరైనా బిడ్డను పొరపాటును ఎత్తుకు వచ్చిందేమోనని భావించాడు. అయితే పోలీసుల విచారణలో పింగ్ పాంగ్ చేసిన మంచి పని తెలిసి ఉప్పొంగిపోయాడు.

బిడ్డను పూడ్చిపెట్టిన బాలిక ఇంటికి వెళ్లిన పోలీసులు... ఆమె మైనర్ కావడంతో బిడ్డను తనకి అప్పగించలేదు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, పసిబిడ్డను పెంచుకునేందుకు ముందుకు వచ్చినా వారికి కూడా బిడ్డను అప్పగించని అధికారులు... శిశుసంక్షేమ శిబిరంలో చేర్చారు. బుధవారం జరిగిన ఈ సంఘటనతో పింగ్ పాంగ్ ఒక్కసారిగా హీరోగా మారిపోయింది. ఇందులో ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే... పింగ్ పాంగ్‌కు మూడు కాళ్లు మాత్రమే పనిచేస్తాయట. ఓ కారు ఢీకొనడంతో వెనక కాలు ఒకటి చచ్చుబడిపోయిందట. వైకల్యంలోనూ పసి ప్రాణాలు కాపాడేందుకు చలించిపోయిన మూగజీవిని చూసి దాని యజమాని ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాడు.First published: May 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు