8 నెలల చిన్నారిపై కన్నతండ్రి దారుణచర్య... సహకరించిన తల్లి, చెల్లి...

పసికందుపై కన్నతండ్రి రాక్షసత్వం... ఇష్టం వచ్చినట్టు కొట్టి చంపి, పొలంలో పడేసి కిడ్నాప్ చేశారంటూ డ్రామా...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 5, 2019, 3:32 PM IST
8 నెలల చిన్నారిపై కన్నతండ్రి దారుణచర్య... సహకరించిన తల్లి, చెల్లి...
8 నెలల చిన్నారిపై కన్నతండ్రి దారుణచర్య... బ్యాగులో కుక్కి, పొలంలో పడేసి...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 5, 2019, 3:32 PM IST
8 నెలల పసికందు. అప్పుడప్పుడూ పాకడం నేర్చుకునే బాల్యం. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తండ్రి... చిన్నారిని అతిదారుణంగా చంపి హత్య చేశాడు. ఆ తర్వాత బ్యాగులో కుక్కి పొలంలో పడేసి, ఎవ్వరో కిడ్నాప్ చేశారంటూ కిడ్నాప్ డ్రామా ఆడారు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన అమెరికాలోని టెక్సాస్‌లో వెలుగుచూసింది. టెక్సాస్‌లో ఉండే 34 ఏళ్ల క్రిస్టోఫర్ డావిలా భార్య 8 నెలల క్రితం ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డకు 6 నెలలు నిండిన తర్వాత భార్య ఉద్యోగానికి వెళ్తుండడంతో కొడుకును చూసుకోవాల్సిన బాధ్యత క్రిస్టోఫర్‌పై పడింది. రెండు నెలల పాటు కొడుకును బాగానే చూసుకున్న క్రిస్టోఫర్, అతని తల్లి, చెల్లి... ఆ తర్వాత అల్లరి భరించలేక బాబుపై కక్ష పెంచుకుంచారు. నవ్వినా, పాలు తాగకపోయినా, అల్లరి చేసినా పసికందుపై అరుస్తూ కొట్టేవారు. ఏదో విషయమై తీవ్ర ఆవేశానికి లోనైన క్రిస్టోఫర్ డావిలా... కొడుకు ఇష్టం వచ్చినట్టు కొట్టి కొట్టి చంపాడు. కొడుకు ఆవేశంలో చేస్తున్న అమానుష చర్యను ఆపాల్సింది పోయి... చూస్తూ ఉండిపోయారు అతని తల్లి, చెల్లి. కొడుకును కసితీరా చంపిన తర్వాత ఓ కాలేజీ బ్యాగులో కుక్కి... ఊరి చివర ఉన్న ఓ పొలంలో పడేశాడు క్రిస్టోఫర్. తర్వాత కొడుకును ఎవ్వరో కిడ్నాప్ చేశారంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు క్రిస్టోఫర్.

పొలం మధ్యలో కాలేజీ బ్యాగ్ కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. బాంబు పెట్టారేమోననే అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. బాంబ్ స్క్వాడ్ వచ్చి బ్యాగును తెరిచి చూసి షాక్‌కు గురయ్యారు. బలమైన దెబ్బల కారణంగా ముఖం చిట్లిపోయి, శరీరంగా వంకరలు తిరిగిపోయి ఉండడం చూసి పోలీసులు కూడా కంటనీరు పెట్టుకున్నారు. ఎనిమిది చిన్నారిని ఇంత దారుణంగా ఎవరు కొట్టి చంపారో అర్థం కాక అయోమయ్యానికి గురయ్యారు పోలీసులు. పోలీసుల దర్యాప్తులో కన్న తండ్రే ఈ దారుణం చేశాడని తెలింది. క్రిస్టోఫర్ డావిలాతో పాటు అతనికి సాయం చేసిన తల్లి, చెల్లిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు. కనీసం మాటలు కూడా రాని పసికందుపై ఇంత దారుణానికి ఒడిగట్టిన క్రిస్టోఫర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తుననారు స్థానికులు.


First published: April 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...