కన్నతల్లి శవాన్ని చెత్తకుప్పలో పడేసిన కొడుకు... మానవత్వం చచ్చింది...

ఫుల్లుగా తాగి వచ్చి పడుకున్న కొడుకు... తల్లి చనిపోయిన విషయాన్ని గుర్తించి, శవాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి, చెత్తకుప్పలో పడేసిన కొడుకు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 28, 2019, 7:18 PM IST
కన్నతల్లి శవాన్ని చెత్తకుప్పలో పడేసిన కొడుకు... మానవత్వం చచ్చింది...
కన్నతల్లి శవాన్ని చెత్తకుప్పలో పడేసిన కొడుకు... (నమూనా చిత్రం)
  • Share this:
మనిషి అనేవాడు సిగ్గుతో తలదించుకోవాల్సిన దారుణ సంఘటన ఇది. నవమాసాలు మోసి, కని పెంచిన కన్నతల్లిని తిండి పెట్టకుండా చంపిన దుర్మార్గపు కొడుకుల గురించి చాలాసార్లు విన్నాం, తల్లిని సరిగ్గా పట్టించుకోకుండా ఆరుబయట వదిలేసిన కఠిన హృదయుల గురించి కూడా విని ఉంటాం. కానీ తల్లి చనిపోతే ఎంతటి కఠినాత్ములైనా ‘అమ్మా...’ అని విలపిస్తారు. కానీ మానవత్వం చచ్చిన ఓ మృగం మాత్రం కన్నతల్లి చనిపోయిందని తెలిసి, ఇంట్లో ఉంటే కంపు కొడుతుందని శవాన్ని చెత్తకుప్పలో పడేశాడు. సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన అమెరికాలోని టెక్సాస్ ఏరియాలో వెలుగుచూసింది. 42 ఏళ్ల జెరెమీ డేవిడ్ అనే వ్యక్తి టెక్సాస్‌లో తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. తాగుడు బానిసైన డేవిడ్... రోజూ రాత్రి తాగి వచ్చి, 64 ఏళ్ల తల్లితో గొడవపడేవాడు.

అలాగే కొన్నిరోజుల క్రితం ఫుల్లుగా తాగి వచ్చి పడుకున్న డేవిడ్... తర్వాతి రోజు మధ్యాహ్నం నిద్రలేచాడు. తల్లి చప్పుడు వినిపించకపోవడంతో ఆమె బెడ్‌రూమ్‌కి వెళ్లి, తినడానికి ఏమీ వండకుండా పడుకున్నావా అని తిట్ల దండకం మొదలెట్టాడు. అయితే ఎంత తిట్టినా కదలిక లేదని అనుమానం వచ్చి, కదిపి చూడగా తల్లి ప్రాణాలు విడిచిన విషయం తెలిసింది. విషయాన్ని వెంటనే అమ్మమ్మకు ఫోన్‌చేసి చెప్పిన డేవిడ్... తల్లి శవాన్ని ఓ పెద్ద ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి, ఇంటి పక్కనే ఉన్న చెత్తకుప్పలో పడేశాడు. కన్నకూతురు చనిపోయిన విషయం తెలుసుకుని, ఆమెను కడసారి చూసుకుందామని ఆశగా ఇంటికొచ్చిన అతని అమ్మమ్మ... అక్కడ మృతదేహం లేకపోవడంతో షాక్‌కు గురైంది. ఏం చేశావని డేవిడ్‌ను నిలదీయగా... ఇంట్లో కంపుకొడుతుందని శవాన్ని చెత్తకుప్పలో పడేశానని అసలు విషయం తాపీగా చెప్పాడు. తన కూతురు మృతదేహాన్ని, మనవడు తీవ్రంగా అవమానించాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... తల్లి శవాన్ని చెత్తకుప్పలో పడేసిన డేవిడ్‌ను అరెస్ట్ చేశారు. మృతదేహాలకు ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా తల్లి శవానికి ఇవ్వని అతనికి, అమెరికన్ చట్టాల ప్రకారం రెండేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

First published: March 28, 2019, 7:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading