దొంగతనానికి ‘సాక్ష్యం’ చెబుతానంది... అంతలోనే ఆత్మహత్య... పోలీసుల విచారణ కారణంగా...

గుడిలో దొంగతనానికి సాక్ష్యం చెబుతానన్న గృహిణి... విచారణ పేరుతో తరుచూ పోలీసుల రాక... భయాందోళనలకు గురై మహిళ ఆత్మహత్య...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 10, 2019, 8:15 PM IST
దొంగతనానికి ‘సాక్ష్యం’ చెబుతానంది... అంతలోనే ఆత్మహత్య... పోలీసుల విచారణ కారణంగా...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 10, 2019, 8:15 PM IST
దొంగతనానికి సాక్ష్యం చెబుతానన్న మహిళ... అంతలోనే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఎంతో ధైర్యంగా సాక్ష్యం చెప్పడానికి సిద్ధమైన మహిళ... ఒక్కసారిగా ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది తెలియక అందరూ ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన... స్థానికంగా సంచలనం క్రియేట్ చేసింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తేర్పోల్ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో డిసెంబర్ 18న రాత్రి దొంగతనం జరిగింది. ఆలయంలో పెద్ద శబ్దం వినిపించడం పక్కింట్లో ఉన్న పటోళ్ల సుధ... గుడివైపు చూసింది. దొంగతనం జరిగిందని... నలుగురు దొంగలు ఆలయంలో చొరబడడాన్ని గమనించింది. అయితే ఆమె ఫోన్‌లో బ్యాలెన్స్ లేకపోవడంతో ఎవ్వరికీ సమాచారం ఇవ్వలేకపోయింది. ఇంట్లో పిల్లలతో పాటు ఒంటరిగా ఉన్న ఆమె సాహసం చేసి... వారిని పట్టుకోవడానికి ప్రయత్నించలేకపోయింది. గుడిలో చొరబడిన దొంగలు దాదాపు మూడు కిలోల వెండి ఆభరణాలు, హుండీలో ఉన్న లక్షల డబ్బును కాజేశారు.

పటోళ్ల సుధ భర్త రామకృష్ణారెడ్డి నైట్ డ్యూటీకి వెళ్లడంతో ఉదయం వచ్చిన తర్వాత విషయం చెప్పింది. గ్రామస్థులకూ, పోలీసులకూ సమాచారం అందించింది. దొంగతనం చేసిన వ్యక్తులను చేశానని, సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమయ్యింది. అయితే దొంగలను గుర్తుపడతానని చెప్పిన పాపానికి ఆమెకు లేనిపోని ఇబ్బందులు ఎదురయ్యాయి. దర్యాప్తు పేరుతో పోలీసులు తరుచూ ఆమె ఇంటికి వచ్చి పోతుండడం, అడిగిందే మళ్లీ మళ్లీ అడిగి విసిగిస్తుండడంతో సుధ తీవ్ర ఆవేదనకు గురైంది. ‘దొంగతనం జరిగితే నీకెందుకు? ఎందుకు సాక్ష్యం చెబుతానన్నావ్? నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టరు పోలీసులు... దొంగలు కూడా నీ మీద పగ పెంచుకుంటారు’ అంటూ చుట్టుపక్కలవాళ్లు ఆమెను తీవ్రంగా భయపెట్టారు. దీంతో భయాందోళనలకు గురై, తీవ్ర మనోవేదనకు లోనైన సుధ... ఆత్మహత్య చేసుకుంది. సుధకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. తల్లి ఆకస్మిక మరణంతో వారిద్దరూ తల్లి లేని అనాథలుగా మిగిలిపోయారు. సుధ మృతికి పోలీసులే కారణమంటూ గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి...

థాయిలాండ్‌లో సౌదీ యువతికి అవమానం... ఆస్ట్రేలియా యువతుల ‘టాప్‌లెస్’ నిరసన...
మేనల్లుడి ప్రేయసితో స్నేహం... అతిదారుణంగా చంపి... తులసి మొక్క నాటాడు...


గుల్బర్గా బస్టాప్‌లో ‘లైవ్ మర్డర్’... కత్తులతో పొడుస్తున్నా స్పందించని జనం... వైరల్ వీడియో...


‘ఖాకీ జూదం’... పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన పోలీసులు...

Loading...

ఎటిఎంలో పరిచయమయ్యాడు... యువతిని మాటల్లో పెట్టి దోచేశాడు...


‘ముద్దుగా ఉన్నావ్... ఓ ముద్దు ఇవ్వవా’... విద్యార్థినికి 50 ఏళ్ల ‘నీచపు టీచర్’ మెసేజ్...

First published: January 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...