ప్రేయసిని కలుసుకోవడానికి అడ్డుగా ఉన్నాడని, ఆమె భర్తను చంపిన ప్రియుడు...

పాఠశాల నుంచే ప్రేమించిన యువతికి పెళ్లి... పెళ్లైన ఆమెను మరిచిపోని ప్రేమికుడు... కలుసుకునేందుకు అడ్డుగా ఉన్నాడని కిరాయి రౌడీతో భర్తను చంపించిన యువకుడు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 9, 2019, 4:13 PM IST
ప్రేయసిని కలుసుకోవడానికి అడ్డుగా ఉన్నాడని, ఆమె భర్తను చంపిన ప్రియుడు...
ప్రియురాలిని కలుసుకోవడానికి అడ్డుగా ఉన్నాడని, ఆమె భర్తను చంపిన ప్రియుడు...
  • Share this:
ప్రియురాలిని కలుసుకునేందుకు అడ్డుగా ఉన్నాడని, ఆమె భర్తను చంపించాడో ప్రియుడు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన సిద్ధిపేట జిల్లాలోని జహీరాబాద్ టౌన్‌ సమీపంలో వెలుగుచూసింది. కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల మహ్మద్ ముబీన్‌కు అదే ఏరియాలో ఉంటున్న సయ్యద్ కరీం అనే యువకుడి భార్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. పాఠశాల నుంచే ముబీన్, ఆమెను ప్రేమిస్తున్నాడు. సయ్యద్ కరీం బతుకుతెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లడంతో తల్లిగారింటికి వచ్చిన ఆమెను తరుచూ కలుస్తూ ఉండేవాడు ముబీన్. భర్త దూరంగా, మరో దేశంలో ఉండడంతో తన చిన్ననాటి ప్రియురాలు మళ్లీ తన దగ్గరికి వచ్చేస్తుందనే నమ్మకం అతనికి కలిగింది. అయితే ఆరు నెలల క్రితం కరీం గల్ఫ్ నుంచి స్వదేశానికి వచ్చాడు. భార్యతో కలిసి జహీరాబాద్ టౌన్‌లో ఓ షాపు పెట్టుకుని జీవనం సాగించేవాడు.

అయితే భర్త తిరిగి వచ్చిన తర్వాత ప్రియురాలిని కలుసుకోవడం ముబీన్‌కు చాలా కష్టంగా మారింది. భర్త నిర్వహించే షాపుకీ, ఇంటికీ పెద్ద దూరం లేకపోవడంతో ఆమెను ఎలా కలుసుకోవాలో తెలియక ముబీన్ తెగ ఇబ్బంది పడేవాడు. తన ప్రియురాలిని కలుసుకునేందుకు అడ్డుగా ఉన్న ఆమె భర్తను చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. అయితే తాను చంపితే ప్రియురాలు తనకు శాశ్వతంగా దూరమవుతుందనే భయంతో అబ్దుల్ సమద్ అనే 30 ఏళ్ల కిరాయి రౌడీని ఆశ్రయించాడు. స్కూల్ బ్యాగులు కుట్టుకునే వ్యాపారం చేసి, అప్పుల పాలైన సమద్... కరీం ఇస్తానన్న రూ.3 లక్షల కోసం ఆశపడి కరీంను చంపేసందుకు పథకం పన్నాడు. పథకం ప్రకారం కొబ్బరి బొండాలు నరికే కత్తితో కరీం దుకాణానికి వెళ్లిన సమద్.. అతన్ని గొంతుపై నరికి చంపాడు. కరీం చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ముబీన్, సమద్‌లు ఇద్దరూ కలిసి మైటార్ సైకిల్‌పై పారిపోయారు. ప్రత్యేక్ష సాక్ష్యుల ద్వారా ఆధారాలు చేపట్టి, నిందితులను గాలించిన పోలీసులు, రెండు రోజుల్లోనే వారిని అదుపులోకి తీసుకున్నారు. కరీంకు నాలుగేళ్ల క్రితం పెళ్లి కాగా, ఓ కుమార్తె కూడా ఉంది.
First published: April 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading