ఆరేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం... హైదరాబాద్‌లో దారుణం...

ఒంటరిగా ఆడుకుంటూ ఉన్న బాలికకు చాక్లెట్లు ఇప్పిస్తానని ఆశచూపి... నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం... చిన్నారి అరుపులతో అక్కడికి చేరుకుని, కాపాడిన స్థానికులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 10, 2019, 5:07 PM IST
ఆరేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం... హైదరాబాద్‌లో దారుణం...
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం... హైదరాబాద్‌లో దారుణం...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 10, 2019, 5:07 PM IST
హైదరాబాద్ నగరంలో దారుణం వెలుగుచూసింది. సరిగ్గా మాటలు కూడా పలకడం రాని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేసి దొరికిపోయాడు ఓ వృద్ధుడు. మంగళవారం పాతబస్తీలో జరిగిన ఈ దారుణ సంఘటన... స్థానికంగా సంచలనం క్రియేట్ చేసింది. శాలిబండకు చెందిన హబీబ్ అలీల్ హమద్ అనే వ్యక్తి... అదే ఏరియాలో ఆడుకుంటున్న ఓ ఆరేళ్ల చిన్నారిపై కన్నేస్తాడు. ఒంటరిగా ఆడుకుంటూ ఉన్న బాలికకు చాక్లెట్లు ఇప్పిస్తానని ఆశచూపిన హబీబ్ అలీల్, ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. తర్వాత బాలికపై అత్యాచారానికి యత్నించాడు. ఈ హఠాత్ సంఘటనతో భయబ్రాంతులకు గురైన చిన్నారి, ఒక్కసారిగా అరవడం మొదలెట్టింది. చిన్నారి అరుపులతో సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు... పారిపోయేందుకు ప్రయత్నించిన హబీబ్ అలీల్‌ను పట్టుకుని, చితక్కొట్టారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... నిందితుడిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని ఇంటి దగ్గర వదిలేసి, ఆమె తల్లిదండ్రులు పనికి వెళ్లినట్టు తెలిసింది. బాలికపై అత్యాచార యత్నం సంఘటన గురించి తెలుసుకుని షాక్‌కు గురయ్యారు.

కొన్నిరోజుల కిందట పాతబస్తీ ఏరియాలోనే ఓ 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. పిజ్జా ఇప్పిస్తానని నమ్మించిన ఓ యువకుడు, ఆమెపై అత్యాచారానికి పాల్పడి వీడియో రికార్డు చేశారు. ఆ వీడియోతో బ్లాక్‌మెయిలింగ్ చేసి నలుగురు స్నేహితులతో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటనకు పాల్పడిన వారంతా ధనికుల వారసులు కావడంతో కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు. ఇది జరిగిన తర్వాత అల్వాల్ ఏరియాలో ఆరేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడి, అతిదారుణంగా చంపేశాడో బీహారీ వాసి. ఇప్పుడు అచ్ఛం దానిపోలిన మరో సంఘటన వెలుగుచూడడం నగరవాసులను కలవరానికి గురి చేస్తోంది.

First published: April 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...