భార్య పుట్టింటికి వెళ్లిందనే కోపంతో... ఇద్దరు చిన్నారులను అతిదారుణంగా...

రోజూ తాగి వచ్చి,కొడుతూ, తిడుతూ భర్తను వదిలేసి వెళ్లిపోయిన భార్య... భార్యపై కోపాన్ని పిల్లలపై చూపించిన తండ్రి... సంగారెడ్డి జిల్లాలో దారుణం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 17, 2019, 9:01 PM IST
భార్య పుట్టింటికి వెళ్లిందనే కోపంతో... ఇద్దరు చిన్నారులను అతిదారుణంగా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. భార్య పుట్టింటికి వెళ్లిందనే కోపంతో ఇద్దరు చిన్నారులను అతిదారుణంగా హతమార్చాడో కసాయి తండ్రి. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం ఏరియాలో వెలుగుచూసింది. రామచంద్రాపురం ఏరియాలోని బొంబై కాలనీకి చెందిన కుమార్, శిరీషలకు ముగ్గురు సంతానం. 10 ఏళ్ల మల్లీశ్వరి, 7 ఏళ్ల అఖిల్, నాలుగేళ్ల శరణ్యలతో కలిసి నివాసం ఉంటున్న కుమార్ దంపతులకు కొన్నాళ్లుగా మనస్పర్థల కారణంగా గొడవలు జరుగుతున్నాయి. మద్యానికి బానిసైన కుమార్... రోజూ తాగి వచ్చి, భార్యను కొడుతూ, తిడుతూ వేధిస్తున్నాడు. భర్త వేధింపులు భరించలేక శిరీష... నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలను మాత్రం తండ్రి దగ్గరే వదిలేసి, వెళ్లిపోయింది. ఎంత పిలిచినా భార్య తిరిగి కాపురానికి రాకపోవడంతో తీవ్ర ఆవేశానికి గురైన కుమార్... ఆ కోపాన్ని అన్యం పున్యం ఎరుగని చిన్నారులపై చూపించాడు.

మంగళవారం అర్ధరాత్రి ఫుల్లుగా తాగి వచ్చిన కుమార్... మద్యం మత్తులో పిల్లలపై దారుణంగా దాడి చేశాడు. కుమారుడు అఖిల్‌తో పాటు నాలుగేళ్ల చిన్నారి శరణ్యను ఉరివేసి చంపేసిన కుమార్... పెద్ద కూతురు మల్లీశ్వరిని కత్తితో పొడిచాడు. తండ్రి కత్తితో దాడి చేస్తున్న సమయంలో మల్లీశ్వరి గట్టిగా అరుపులు, కేకలు వేయడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. తాగిన మత్తులో కుమార్ చేస్తున్న దారుణ చర్యను కళ్లారా చూసి... రక్తపు మడుగుల్లో పడి ఉన్న మల్లీశ్వరిని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు వచ్చే సమయానికే అఖిల్, శరణ్య ప్రాణాలు విడిచారు. తీవ్ర గాయాలపాలైన మల్లీశ్వరి, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. భార్య మీద కోపంతో చిన్నారులను హత్య చేసిన కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... కేసు దర్యాప్తు చేస్తున్నారు.

First published: April 17, 2019, 9:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading