ఏడు పెళ్లిళ్లు చేసుకున్న ఆటోడ్రైవర్... భర్త ఆ పని చేయమనడంతో చంపేసిన ఏడో భార్య..

నిత్యం తాగి వచ్చి, వ్యభిచారం చేయలంటూ భార్యకు వేధింపులు... మానసిక క్షోభ భరించలేక భర్తను హత్య చేసిన ఏడో భార్య... తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో వెలుగుచూసిన దారుణం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 10, 2019, 11:04 PM IST
ఏడు పెళ్లిళ్లు చేసుకున్న ఆటోడ్రైవర్... భర్త ఆ పని చేయమనడంతో చంపేసిన ఏడో భార్య..
ఏడు పెళ్లిళ్లు చేసుకున్న ఆటోడ్రైవర్... భర్త ఆ పని చేయమనడంతో చంపేసిన భార్య..
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 10, 2019, 11:04 PM IST
ఒకటి కాదు, రెండు కాదు... మూడు, నాలుగు అసలే కాదు... ఏకంగా ఏడుపెళ్లిళ్లు చేసుకున్నాడతను. మరీ ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడంటే... అతను కోటీశ్వరుడో... లక్షాధికారో కాదు. ఓ సాధారణ ఆటో డ్రైవర్. నలుగురు భార్యలు, వేధింపులు భరించలేక అతన్ని వదిలేసి వెళ్లిపోతే... మరో ఇద్దరు అనుమానాస్పదంగా చనిపోయాడు. ఆఖరికి ఏడో భార్య చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు సదరు ఏడుగురు భార్యల భర్త. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో వెలుగుచూసింది. మెదక్ జిల్లాలోని పాపన్నపేటకు చెందిన 42 ఏళ్ల షేక్ షాబుద్దీన్, 2011లో దుండిగల్ ఏరియాకు చెందిన ఖైరున్నీసా బేగంను పెళ్లి చేసుకున్నాడు. షేక్ షాబుద్దీన్‌కు అప్పటికే ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే వారిలో ఓ భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోగా, మరో మహిళ అనారోగ్యంతో చనిపోయింది. మిగిలిన నలుగురు భార్యలు భర్త పెట్టే వేధింపులు భరించలేక, అతన్ని వదిలేసి వెళ్లిపోయారు. ఏడో పెళ్లిగా అప్పటికే పెళ్లై, పిల్లలు కూడా ఉన్న ఖైరున్నీసాను పునర్వివాహం చేసుకున్నాడు షేక్ షాబుద్దీన్.

ఇద్దరు భార్యలు వెళ్లిపోయిన తర్వాత మద్యానికి బానిసైన షేక్ షాబుద్దీన్... నిత్యం తాగి, భార్యను వేధించేవాడు. రోజురోజుకీ అతని వేధింపులు ఎక్కువవుతుండడంతో పాటు డబ్బుల కోసం వ్యభిచారం చేయాలని ఖైరున్నీసా బేగంను వేధించడం మొదలెట్టాడు షేక్ షాబుద్దీన్. అతని వేధింపులు భరిస్తూ వచ్చిన ఖైరున్నీసా... బర్తను చంపేయాలని ఫిక్స్ అయ్యింది. మంగళవారం ఇంటికి వచ్చి గొడవ చేస్తున్న భర్త తలపై ఇనుపరాడ్డుతో బలంగా కొట్టింది. దెబ్బకు కిందపడిన భర్త గొంతుకు చున్నీతో ఉరి బిగించి హత్య చేసింది ఖైరున్నీసా. భర్తను చంపిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.
First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...