కొడుకు భార్యతో మామ అసభ్య ప్రవర్తన... ఎంత చెప్పినా భర్త వినడం లేదని...

కోడలికి తోడుగా ఇంట్లో ఉంటూ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడిన మామ... భర్తకు చెప్పినా నమ్మకుండా తిట్టడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న యువతి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 17, 2019, 2:44 PM IST
కొడుకు భార్యతో మామ అసభ్య ప్రవర్తన... ఎంత చెప్పినా భర్త వినడం లేదని...
కొడుకు భార్యతో మామ అసభ్య ప్రవర్తన... భర్త చెప్పినా వినడం లేదని...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 17, 2019, 2:44 PM IST
కొడుకు భార్య అంటే కూతురితో సమానం అంటారు. అయితే అతను మాత్రం కూతురు లాంటి కొడలిలో కూడా కామాన్నిచూశాడు. లైంగికంగా వేధిస్తూ నరకం చూపాడు. మామగారు ఇలా చేస్తున్నాడని భర్తకు చెప్పినా అతను పట్టించుకోలేదు. దాంతో ఏం చేయాలో తెలియక, ఎవ్వరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచిందా యువతి. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగుచూసింది. అరక్కోణం సమీపంలో తిరుత్తణి మండలంలోన వెంకటాపురం గ్రామానికి చెందిన మునికృష్ణన్, అదే గ్రామానికి చెందిన యువరాణి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. మునికృష్ణణ్ లారీడ్రైవర్ పనిచేస్తూ, రాత్రిపగలు తేడా లేకుండా పనులకు వెళ్లేవాడు. అయితే కోడలికి తోడుగా ఇంట్లో ఉండే మునికృష్ణన్ తండ్రి ఢిల్లీబాబు... మొదట్లో బాగానే ఉండేవాడు. అయితే కొన్నాళ్లకు కోడలిపై కన్నేసి, లైంగికంగా వేధించేవాడు. కోరిక తీర్చాలంటూ కోడలితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఢిల్లీబాబు ఇలా ప్రవర్తిస్తున్నాడని భర్త మునికృష్ణన్‌ను ఎన్నిసార్లు చెప్పినా, అతను పట్టించుకోలేదు. తన తండ్రి గురించి తనకు తెలుసని, చాడీలు చెబుతూ కుటుంబంలో కలహాలు తేవడానకి ప్రయత్నిస్తున్నావంటూ ఆమెనే తిట్టేవాడు.

మామ వేధింపులు మరీ ఎక్కువైపోవడం, భర్త ఎంత చెప్పినా తనను నమ్మకపోవడంతో యువరాణి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విధులను ముగించుకుని ఇంటికి వచ్చిన మునికృష్ణన్, ఆత్మహత్య చేసుకున్న యువరాణిని చూసి షాక్‌కు గురయ్యాడు. తండ్రి వేధింపుల గురించి చెప్పినా తాను పట్టించుకోకపోవడం వల్లే భార్య ఇలా చేసిందని గ్రహించి...ఢిల్లీబాబు గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోడలు యువరాణి ఆత్మహత్యకు కారణమైన ఢిల్లీబాబును అరెస్ట్ చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...