యువకుడితో తల్లి ఆ సంబంధం... విషయం తెలిసిన కూతురు దారుణంగా...

తల్లి ప్రియుడిని ఆ సంబంధం గురించి హెచ్చరించిన కూతురు.. ఆవేశంతో బాలికపై చెప్పులతో దాడి చేసిన యువకుడు... మనస్థాపంతో పురుగుల మందు తాగి, బాలిక ఆత్మహత్య...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 9, 2019, 8:13 PM IST
యువకుడితో తల్లి ఆ సంబంధం... విషయం తెలిసిన కూతురు దారుణంగా...
యువకుడితో తల్లి ఆ సంబంధం... విషయం తెలిసిన కూతురు దారుణంగా...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 9, 2019, 8:13 PM IST
ఆమె వయసు 41 ఏళ్లు. భర్త చనిపోయాడు. అదే గ్రామానికి చెందిన 33 ఏళ్ల యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక, ఆత్మహత్య చేసుకుని అఘాయిత్యానికి పాల్పడింది. స్థానికంగా తీవ్ర కలకలం క్రియేట్ చేసిన ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని టీ.నగర్ సమీపంలో వెలుగుచూసింది. విల్లుపురం జిల్లా చిన్న సేలం ఏరియాకు దగ్గర్లో ఉన్న నైనార్ పాళయం గ్రామానికి చెందిన 41 ఏళ్ల కవితాదేవికి ఓ కూతురు ఉంది. ఆమె భర్త ఎనిమిదేళ్ల క్రితమే చనిపోవడంతో కూతురిని చూసుకుంటూ జీవనం సాగిస్తోంది కవితాదేవి. భర్త పోయిన తర్వాత నాలుగేళ్లు ఒంటరిగా ఉన్న కవితాదేవికి, అదే ఏరియాకు చెందిన రాజేంద్రన్ అనే 33 ఏళ్ల యువకుడితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇళ్లు పక్కపక్కనే ఉండడంతో తల్లికి, అతనికీ మధ్య ఉన్న శారీరక సంబంధాన్ని గుర్తించింది కవితాదేవి కూతురు 16 ఏళ్ల భాగ్యలక్ష్మీ. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న భాగ్యలక్ష్మీ, తల్లి అతని ఇంటి నుంచి వస్తుండడం గమనించి, అక్కడికి వెళ్లి రాజేంద్రన్‌ను హెచ్చరించింది.

ఇంటి ముందుకు వచ్చి బెదిరిస్తున్న భాగ్యలక్ష్మీపై తీవ్ర ఆవేశానికి లోనైన రాజేంద్రన్ ఆమెపై దాడి చేశాడు. చెప్పుతో కొడుతూ బండబూతులు తిట్టాడు. ఈ సంఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన భాగ్యలక్ష్మీ... తల్లి ఇంట్లో లేని సమయంలో ఎలుకల మందు తిని, ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి చేరుకున్న కవితాదేవి... కూతురు విగతజీవిగా పడి ఉండడం చూసి షాక్‌కు గురైంది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... కవితాదేవి, రాజేంద్రన్‌లను అరెస్ట్ చేశారు.
First published: April 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...