హోమ్ /వార్తలు /క్రైమ్ /

జడ్జి కళ్లెదుటే భార్యను కత్తితో పొడిచిన భర్త... మద్రాస్ హైకోర్టులో దారుణం...

జడ్జి కళ్లెదుటే భార్యను కత్తితో పొడిచిన భర్త... మద్రాస్ హైకోర్టులో దారుణం...

మద్రాస్ హైకోర్టు (నమూనా చిత్రం)

మద్రాస్ హైకోర్టు (నమూనా చిత్రం)

మద్రాస్ హైకోర్టులో దారుణ సంఘటన... విడాకుల కోసం వచ్చి, భార్యపై కత్తితో దాడి చేసిన భర్త... న్యాయమూర్తి కళ్లెదుటే దారుణ చర్య...

    తప్పు చేసినా న్యాయమూర్తి చేయలేదని నిరూపించుకునేందుకు మహా బుద్ధిమంతుల్లా నటిస్తుంటారు చాలామంది ముద్దాయిలు. అయితే ఓ వ్యక్తి మాత్రం న్యాయమూర్తి కళ్లెదుటే భార్యపై కత్తితో దాడి చేశాడు. తమిళనాడు రాష్ట్రంలో సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన మద్రాస్ హైకోర్టులో జరిగింది. చెన్నైకి చెందిన శరవణన్, తన భార్య వరలక్ష్మీ మనస్పర్థల కారణంగా విడాకుల తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. విచారణ నిమిత్తం మద్రాస్ హైకోర్టు ఫ్యామిలీ కోర్డుకు వచ్చారు. ఈ కేసును న్యాయమూర్తి కళైవాసన్ విచారణ చేస్తున్నాడు. ఈ సమయంలో శరవణన్ నుంచి విడాకులు ఎందుకు కోరుకుంటున్నావని వరలక్ష్మీని అడిగాడు న్యాయమూర్తి. దానికి ఆమె చెప్పిన సమాధానంతో తీవ్రమైన ఆవేశానికి లోనైన శరవణన్. కత్తి తీసుకుని ఆమెపై దాడి చేశాడు. కోర్టు హాలులో ఉండగానే ఆవేశంగా భార్య దగ్గరకు పరుగెత్తుకొచ్చి కత్తితో పొడిచాడు.


    ఊహించని సంఘటనతో షాక్‌కు గురైన భద్రతా సిబ్బంది వెంటనే తేరుకుని, శరవణన్‌ను అడ్డుకున్నారు. అప్పటికే కత్తిదాడిలో గాయాలపాలైన వరలక్ష్మీని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కత్తి కడుపులో బలంగా దిగడంతో వరలక్ష్మి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు డాక్టర్లు. భార్యపై దాడి చేసిన భర్త శరవణన్‌పై హత్యాయత్నం కేసు నమోదుచేశారు పోలీసులు. న్యాయమూర్తి ఎదుటే కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ దాడి స్థానికంగా సంచలనం క్రియేట్ చేసింది.    First published:

    Tags: Crime, High Court, Tamilnadu

    ఉత్తమ కథలు