14 ఏళ్ల కుమార్తెపై ప్రియుడితో అత్యాచారం చేయించి, చంపిన తల్లి... ముక్కలుగా కోసి...

అనాథ పిల్లలను దత్తత తీసుకుంటూ వారిపై లైంగిక దాడి... కేడీ దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 14 ఏళ్ల బాలిక... కక్ష్య కట్టి, ప్రియుడితో కలిసి అఘాయిత్యానికి పాల్పడిన దత్తత తల్లి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 6, 2019, 3:44 PM IST
14 ఏళ్ల కుమార్తెపై ప్రియుడితో అత్యాచారం చేయించి, చంపిన తల్లి... ముక్కలుగా కోసి...
14 ఏళ్ల కుమార్తెపై ప్రియుడితో అత్యాచారం చేయించి, దారుణంగా చంపి... ముక్కలుగా కోసి...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 6, 2019, 3:44 PM IST
పెన్సిల్వేనియాలో దారుణం వెలుగుచూసింది. 14 ఏళ్ల బాలికపై అతిదారుణంగా అత్యాచారం చేసి, ఆపై ముక్కలు కోసి హత్య చేశాడో వ్యక్తి. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన పెన్సిల్వేనియాలో వెలుగు చూసింది. 2007లో స్థానికంగా ఓ ఆశ్రమంలో అనాథల దత్తల విషయాలు చూసే సారా, ఆమె భర్త డేవిడ్ ఎందరో అనాథ పిల్లలను దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న వారికి ఆశ్రమంలో సౌకర్యాలు కల్పించేవారు. అయితే పైకి ఎంతో మంచివాళ్లుగా నటించే సారా భర్త డేవిడ్ టీనేజ్ అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడేవాడు. దానికి భార్య సారా కూడా సహకరించేది. ఇలా ఈ దంపతులు దత్తత తీసుకున్నవారిలో గ్రేస్ అనే 14 ఏళ్ల అమ్మాయి కూడా ఉంది. గ్రేస్‌పై కూడా డేవిడ్ అలాగే ప్రవర్తించేవాడు. ఆమెపై చాలాసార్లు అత్యాచారం చేసిన డేవిడ్... లైంగికంగా హింసించేవాడు. ఆశ్రమం నుంచి తప్పించుకున్న గ్రేస్... విషయాన్ని పోలీసులకు చెప్పింది. దాంతో డేవిడ్ మీద కేసు నమోదుచేసుకున్న పోలీసులు... సారాను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆమె ఇక మరెవ్వరినీ దత్తత తీసుకోవడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించారు.

ఈ సంఘటనతో గ్రేస్‌పై కక్ష పెంచుకున్న సారా... ఆమెపై పగ తీర్చుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు జాకబ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. భర్త డేవిడ్ పోలీస్ స్టేషన్‌లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో జాకబ్‌తో శారీరక సంబంధం కొనసాగించింది సారా. గ్రేస్ మీద పగ తీర్చుకునేందుకు జాకబ్ సరైన వాడని భావించి... చిన్నారిని కిడ్నాప్ చేయించింది. 2016లో ఓ రోజు గ్రేస్‌ను కిడ్నాప్ చేసిన ఈ ఇద్దరూ.. ఆమెను ఇంటి బేస్‌మెంట్ ఏరియాకు తీసుకెళ్లారు. అక్కడ ఆమె చేతులు కాళ్లు కట్టేసి, అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి హింసించారు. తర్వాత జాకబ్, గ్రేస్‌పై అత్యాచారం చేశాడు. దత్తత తీసుకున్న తల్లి ప్రేరణతో గ్రేస్‌కు డ్రగ్స్ ఎక్కించారు. మత్తులో పడి ఉన్న గ్రేస్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఎంతో కష్టపడి కట్లు విప్పుకున్న గ్రేస్, డ్రగ్స్ మత్తు కారణంగా బయటికి వెళ్లలేకపోయింది. తర్వాతి రోజు అక్కడికి వచ్చిన జాకబ్, సారా... గ్రేస్ బయటికి వెళితే తమకు శిక్ష పడడం ఖాయమని భావించి పీక పిసికి చంపేశారు. తర్వాత చిన్నారి శరీరాన్ని ముక్కలుగా కోసేశాడు జాకబ్. ఆ బాడీ పార్ట్స్‌ను ఎక్కడ పారేసినా దొరికిపోతామనే భయంతో కొన్ని నెలల పాుట బేస్‌మెంట్‌లోనే దాచి ఉంచారు. పూర్తి కుళ్లిపోయిన తర్వాత ఊరి చివర ఖాళీ స్థలంలో పాతి పెట్టారు. ఆ తర్వాత అనుమానం రాకుండా తన దత్తత కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది సారా. అయితే చాలా నేలల తర్వాత మిస్సింగ్ కేసు పెట్టడంతో అనుమానం వచ్చిన పోలీసులు... తమదైన శైలిలో దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కూతుర్ని తానే ప్రియుడితో చంపించినట్టు ఒప్పుకుంది సారా. సారాకు యావజ్జీవ శిక్ష విధించిన న్యాయస్థానం... 14 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, చంపేసిన జాకబ్‌కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
First published: May 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...