రిసెప్షన్ రోజే మరో యువతితో వరుడు అసభ్యంగా... లేడీస్ బాత్రూమ్‌లోకి వెళ్లి...

వెయిట్రస్‌తో అసభ్యంగా ప్రవర్తిస్తూ వరుడి వింత ప్రవర్తన... అతని నుంచి తప్పించుకునేందుకు బాత్రూమ్‌లో దూరిన బాలిక... ఆమెను వెంబడిస్తూ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 13, 2019, 3:52 PM IST
రిసెప్షన్ రోజే మరో యువతితో వరుడు అసభ్యంగా... లేడీస్ బాత్రూమ్‌లోకి వెళ్లి...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 13, 2019, 3:52 PM IST
పెళ్లి అంటే అదో వేడుక. వధువరూలిద్దరూ జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేని రోజు. అయితే అదే పెళ్లి వేడుకలో వరుడి నిజ స్వరూపం తెలిసి షాక్‌కు గురైంది వధువు. పెళ్లై గంటలు కూడా గడవకముందే మరో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని చూసి ఏమనాలో, ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడిందా పెళ్లికూతురు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో నార్త్ ఆంప్టన్ నగరంలో ఓ పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది. మ్యాథ్యూ ఐమర్స్ అనే 28 ఏళ్ల వరుడు... రిసెప్షన్‌ కోసం అందంగా ముస్తాబయ్యాడు. వధువు రాక కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే ఆ సమయంలో అక్కడికి వచ్చిన వెయిట్రస్ అయిన ఓ టీనేజ్ అమ్మాయిపై మనోడి కన్ను పడింది. అంతే... ఏ మాత్రం ఆలోచించకుండా ఆమె దగ్గరికి వెళ్లి ‘సెక్స్ చేసేందుకు వస్తావా’ అని అడిగాడు.

అయితే తనతో మాట్లాడుతున్నది పెళ్లికొడుకు అనే విషయం గ్రహించిన ఆ అమ్మాయి... అతని మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది. అయితే ఆమెను వదలని అతను వెంబడిస్తూ వెనకే వెళ్లాడు. బాత్రూమ్‌లోకి వెళితే రాలేడనుకున్న ఆ వెయిట్రస్... వాష్‌రూమ్‌లోకి వెళ్లింది. అయితే బాత్రూమ్‌లోకి కూడా దూరిన అతను... బలవంతంగా ముద్దుల పెట్టాడు. బట్టలు విప్పేందుకు ప్రయత్నించాడు. అతని నుంచి తప్పించుకుని... బయటికి వచ్చిన ఆమె అందరికీ విషయం చెప్పింది. దీంతో వరుడి అసలు స్వరూపం తెలిసిన వధువు... అతనితో రిసెప్షన్‌ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఆగ్రహానికి లోనైన అతను... ఆమెను బండబూతులు తిడుతూ... దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు.

First published: February 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...