బాలికపై నలుగురు పోలీసులు అతిదారుణంగా... ఎనిమిది రోజుల పాటు బంధించి...

ఆ హోటల్‌కు ఖాకీ డ్రెస్సులో వచ్చిన నలుగురు వ్యక్తులు ఆమె మీద అత్యాచారం చేశారు. అలా ఒకరోజు కాదు. వరుసగా ఎనిమిది రోజుల పాటు ఆమె మీద దారుణాన్ని కొనసాగించారు.

news18-telugu
Updated: May 18, 2019, 3:48 PM IST
బాలికపై నలుగురు పోలీసులు అతిదారుణంగా... ఎనిమిది రోజుల పాటు బంధించి...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 18, 2019, 3:48 PM IST
మైనర్ బాలిక మీద నలుగురు పోలీసులు ఎనిమిది రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేశారు. ఒడిశాలో ఝార్సుగూడలో ఈ దారుణం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక తన స్నేహితుడు, రవి అనే యువకుడితో కలసి భువనేశ్వర్ వెళ్లింది. అక్కడ వారు ఓ హోటల్లో బస చేశారు. ఆ హాటల్‌కు ఖాకీ డ్రెస్సులోవచ్చిన నలుగురు వ్యక్తులు ఆమె మీద అత్యాచారం చేశారు. అలా ఒకరోజు కాదు. వరుసగా ఎనిమిది రోజుల పాటు ఆమె మీద దారుణాన్ని కొనసాగించారు. తాము పోలీసులమని చెప్పి వారిని బెదిరించడంతో రవి భయపడిపోయాడు. ఎనిమిది రోజుల తర్వాత రవి బాలికను తీసుకుని భువనేశ్వర్‌లోని మరో హోటల్‌కు తీసుకుని వెళ్లాడు. అక్కడ ఓ రోజు వారిద్దరూ గడిపారు. ఆ తర్వాత రోజు రవి ఆమెను హోటల్లోనే వదిలేసి పారిపోయాడు. తన వద్ద డబ్బులు లేకపోవడంతో బాధితురాలు హోటల్ యజమానిని కలిసింది. తన మీద జరిగిన లైంగిక దాడి గురించి అతనికి చెప్పంది. దీంతో వెంటనే హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు.

First published: May 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...