కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అసభ్యంగా ఫోటోలు... యువకుడిని చితకబాదిన అక్కాచెల్లెలు...

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌లో దారుణం... వివాహితకు మత్తుమందు కలిపి ఇచ్చి అసభ్యంగా ఫోటోలు, వీడియోలు... భర్తకు పంపిస్తానంటూ లైంగిక వేధింపులు... ఆకతాయికి సహకరించిన మహిళ మరదలు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 18, 2019, 1:44 PM IST
కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అసభ్యంగా ఫోటోలు... యువకుడిని చితకబాదిన అక్కాచెల్లెలు...
కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి నగ్న ఫోటోలు... యువకుడిని చితకబాదిన అక్కాచెల్లెలు...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 18, 2019, 1:44 PM IST
కూల్‌‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి, స్పృహ తప్పి పడిపోయిన మహిళను అసభ్యకరంగా ఫోటోలు తీసిన ఓ యువకుడు... వాటిని చూపించి ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టాడు. అతని కారణంగా భర్తకు దూరమైన ఆమె... యువకుడిని పిలిచి, చెల్లెలితో కలిసి చితకబాదింది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌లో వెలుగుచూసింది. నిర్మల్ ఏరియాకుచెందిన అనిల్ అనే యువకుడు... తన స్నేహితురాలు, వివాహితకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆ విషయాన్ని గ్రహించని ఆమె కూల్‌డ్రింక్ తాగి, స్పృహ తప్పిపోయింది. ఆ సమయంలో ఆమెతో అసభ్యకరంగా ఫోటోలు, వీడియోలు తీశాడు అనిల్. పక్కనే ఉన్న వివాహిత భర్త చెల్లెలు ఈ పనికి అనిల్‌కు సహకరించడం విశేషం. మరదలి సాయంతో వివాహితను అసభ్యంగా ఫోటోలు, వీడియోలు తీసిన అనిల్... వాటిని తన భర్తకు పంపుతానంటూ వేధించడం మొదలెట్టాడు. తాను చెప్పిన చోటుకి రావాలని, చెప్పినట్టు వినాలని లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. అనిల్ చేతిలో నరకయాతన అనుభవించిన ఆమె... అతను చెప్పినట్టు చేసింది. అయినా వాటిని డిలీట్ చేయకపోతే వేధింపులు పెంచాడు అనిల్. దాంతో అతని ఎదురుతిరిగింది సదరు మహిళ.

మహిళ చెప్పినట్టు వినకపోవడంతో ఆగ్రహానికి లోనైన అనిల్... ఆ ఫోటోలను ఆమె భర్తకు పంపాడు. వేరే వ్యక్తితో అసభ్యంగా, చనువుగా ఉన్నట్టుగా తీసిన ఫోటోలను చూసిన సదరు మహిళ భర్త... యువతిని ఇంట్లో నుంచి గెంటేశాడు. ఆమె ఒంటరిగా ఉంటున్న విషయం తెలుసుకున్న అనిల్... యువతి దగ్గరికి వచ్చి, తనతో రావాలంటూ బలవంతం చేయబోయాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె, తన చెల్లెలితో కలిసి అతన్ని చితకబాదింది. చుట్టుపక్కల వాళ్లు కూడా జరిగింది తెలుసుకుని, ఈ సోదరులకు సహకరించారు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు... అనిల్‌ను అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
First published: May 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...