నల్లగొండలో దారుణం...ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య

వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది ఓ భార్య. ఇందుకోసం రూ. 2 లక్షలు సుపారీ ఇచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

news18-telugu
Updated: July 5, 2019, 5:51 PM IST
నల్లగొండలో దారుణం...ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వివాహేతర సంబంధం కోసం భర్తను చంపించింది ఆ భార్య. హత్య జరిగిన తరువాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు భర్తను హత్య చేశారు అని పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించింది. కానీ... ఈ మొత్తం వ్యవహారంలో మొదటి నుంచి భార్యపైనే అనుమానం పెంచుకున్న పోలీసులు... ఎట్టకేలకు ఈ హత్య కేసులో ఆ పాత్ర ఉందని తేల్చారు. ప్రియుడి కోసం భర్తను చంపిన భార్యతో పాటు ఆమె ప్రియుడిని, అతడిని సహకరించిన మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... నల్లగొండ వాసి అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సోమకేశవులు కొద్దిరోజుల క్రితం హత్యకు గురయ్యాడు.

అతడి ఇంటి బయటే సోమకేశవులును ఎవరో హత్య చేసి వదిలివెళ్లారు. ఘటనపై కేసుల నమోదు చేసుకున్న పోలీసులు... మృతుడి భార్య స్వాతి ఫోన్ కాల్స్‌పై నిఘా పెట్టారు. భర్త హత్యకు ముందు... హత్య తరువాత కూడా ఆమె తరచూ ప్రదీప్ అనే వ్యక్తితో మాట్లాడినట్టు గుర్తించిన పోలీసులు... అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే ప్రదీప్, స్వాతి వివాహేతర సంబంధం... వారిద్దరూ కలిసి సోమకేశవులను ఏ రకంగా చంపించారు అనే విషయం వెలుగులోకి వచ్చింది.

కొంతకాలంగా ప్రదీప్, స్వాతి మధ్య వివాహేతర సంబంధం ఉందని... ఈ విషయంపై సోమకేశవులు,స్వాతి మధ్య గొడవ జరిగిందని పోలీసుల విచారణలో తేలింది. దీంతో స్వాతి, ప్రదీప్ కలిసి సోమకేశవులను పక్కా ప్లాన్ ప్రకాశం హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ఇందుకు మరో ముగ్గురి సాయం కూడా తీసుకున్నారు. భర్తను ఇంట్లో చంపిన తరువాత ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్న స్వాతి... డాగ్ స్వ్కాడ్‌కు చిక్కకుండా ఇంట్లో కారం కూడా చల్లినట్టు పోలీసులు గుర్తించారు.

కేసులో ప్రదీప్‌ను ఏ1, స్వాతిని ఏ2గా చేర్చిన పోలీసులు... మిగతా ముగ్గురిని ఏ3,ఏ4,ఏ5 నిందితులుగా చేర్చారు. నిందితుల నుంచి సుత్తి, టవల్, ఆరు మొబైల్స్, బైక్‌తో పాటు 22 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమకేశవులు, స్వాతిది ప్రేమ వివాహం అని... ఆమె ఇలాంటి పని చేస్తుందని ఊహించలేకపోయామని బంధువులు తెలిపారు.
Published by: Kishore Akkaladevi
First published: July 5, 2019, 5:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading