బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తల్లిదండ్రులను దారుణంగా చంపిన కూతురు... పెళ్లికి ఒప్పుకోలేదని...

క్రికెటర్‌తో పెళ్లికి ఒప్పుకోని తల్లిదండ్రులు... ప్రియుడి సహకారంతో ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిదండ్రులను దారుణంగా చంపిన కూతురు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 18, 2019, 7:04 PM IST
బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తల్లిదండ్రులను దారుణంగా చంపిన కూతురు... పెళ్లికి ఒప్పుకోలేదని...
హైదరాబాద్‌లో దారుణం... కన్నకొడుకునే హత్య చేయించిన తల్లిదండ్రులు...
  • Share this:
కన్నకొడుకులు కన్నవారిని పట్టించుకోవడం మానేయొచ్చేమో కానీ... కూతురు మాత్రం తల్లిదండ్రులను కడుపున పెట్టుకుని కాపాడుతుందంటారు. కన్నవారి కష్టాలను అర్థం చేసుకుని, వారి సుఖం కోరే ప్రేమా, అభిమానం, ఆప్యాయత కేవలం ఆడబిడ్డకు మాత్రమే తెలుస్తుందంటారు. ‘కంటె కూతుర్నే కనాలి’ అంటూ పెద్ద పెద్ద సామెతలు, పాటలు పాడేశారు కూడా. అయితే ఈమె మాత్రం కన్నవారి ప్రేమ కంటే కట్టుకోబోయేవాడే ఎక్కువని భావించింది. ప్రేమించిన యువకుడితో పెళ్లికి ఒప్పుకోవడం లేదని, తల్లిదండ్రులను దారుణంగా చంపేసింది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సిటీలో వెలుగుచూసింది. నాగ్‌పూర్ సిటీలోని వాడి ఏరియాలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న 72 ఏళ్ల శంకర్, 64 ఏళ్ల సీమా దారుణ హత్యకు గురయ్యారు. తలపై బలమైన గాయాలు ఉండడంతో పాటు, హత్య చేసేముందు వారికి ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చినట్టు పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో తేలింది. హత్య కేసు నమోదుచేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. శంకర్, సీమా దంపతులకు పెళ్లై, ఎన్నేళ్లు అయినా పిల్లలు పుట్టలేదు. దాంతో అనాథాశ్రమం నుంచి ఓ అమ్మాయిని తీసుకొచ్చి, దత్తత తీసుకున్నాడు.

ఆమెకు ప్రియాంక అని పేరు పెట్టి, ఏ లోటు రాకుండా చూసుకున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణలో దర్జాగా పెరిగిన ప్రియాంక, పెద్ద చదువులు చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం కూడా సంపాదించింది. కాలేజీలో చదువుకునే సమయంలో ప్రియాంకకు క్లాస్‌మేట్ మహ్మద్ అఖ్లాక్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. మహ్మద్ అఖ్లాక్ రాష్ట్ర స్థాయిలో మంచి క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రంజీల్లో కూడా స్థానం సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే మహ్మద్ అఖ్లాక్, ప్రియాంకల పెళ్లికి శంకర్, సీమా దంపతులు ఒప్పుకోలేదు. మతాలు వేరు కావడమే కాకుండా... మహ్మద్ అఖ్లాక్ ప్రవర్తన వారికి నచ్చకపోవడంతో అతనితో పెళ్లికి ససేమీరా అని తేల్చేశారు. దాంతో తీవ్ర మనస్థాపం చెందిన ప్రియాంక, ప్రియుడితో కలిసి తన ప్రేమకు అడ్డంగా ఉన్న తల్లిదండ్రులను చంపాలని ఫిక్స్ అయ్యింది. పథకం ప్రకారం తల్లిదండ్రులు తినే ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చింది. ఆ తర్వాత ప్రియాంక, ఆమె ప్రియుడు కలిసి శంకర్, సీమాలపై దాడి చేశారు. సుత్తి తీసుకుని తల పగులకొట్టి చంపేశారు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు ఆఫీసుకు వెళ్లిపోయింది ప్రియాంక. ఇంటికి వచ్చేసరికి ఎవరో దాడి చేసి, చంపేశారంటూ కట్టుకథ అల్లింది. అయితే కేసు నమోదుచేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

First published: April 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading