మత్తుగా పడుకున్న రూమ్‌మేట్‌ దుస్తులు తొలిగించి.... నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్...

మద్యం మత్తులో ఒళ్లు తెలియకుండా పడుకున్న టీనేజర్ దుస్తులు విప్పి, నగ్న చిత్రాలు తీసిన రూమ్‌మేట్... వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులు... తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్న కుర్రాడు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 10, 2019, 3:59 PM IST
మత్తుగా పడుకున్న రూమ్‌మేట్‌ దుస్తులు తొలిగించి.... నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మద్యం మత్తులో నిద్రపోతున్న టీనేజ్ కుర్రాడి దుస్తులు తొలగించి, న్యూడ్ ఫోటోలు తీశారు అతని రూమ్‌మేట్స్. వాటిని సోషల్ మీడియాలో పెడతామంటూ అతన్ని బెదిరించి, డబ్బులు లాగడం మొదలెట్టారు. వారి టార్చర్ భరించలేకపోయిన ఆ కుర్రాడు... ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన ముంబై నగరంలోని పాల్ఘర్ వాంగావ్‌లో జరిగింది. ఓ టీనేజ్ కుర్రాడు, తనకు తెలిసిన మరో యువకుడితో కలిసి ముంబైలోని పాల్ఘర్ వాంగావ్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉండేవాడు. ఇద్దరూ బోయిసార్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేసేవారు. కొన్ని వారాల కిందట జీతం వచ్చిన రోజు రూమ్ మేట్స్ పార్టీ చేసుకున్నారు. మరో స్నేహితుడితో కలిసి అద్దె ఇంట్లోనే ఫుల్లుగా మద్యం సేవించారు. అయితే ఫుల్లుగా తాగిన తర్వాత టీనేజర్ మత్తులో ఒళ్లు తెలియకుండా నిద్రపోయాడు. ఎంత పిలిచినా లేవకపోవడంతో రూమ్‌మేట్ బుర్రలో ఓ ఆలోచన వచ్చింది. వెంటనే కుర్రాడి ఒంటి మీద ఉన్న దుస్తులన్నీ తీసేశాడు. న్యూడ్ ఫోటోలు తీశాడు. తర్వాతి రోజు వాటిని చూపించి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టాడు.

అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడం మొదలెట్టాడు. మొదట అతని బెదిరింపులను పెద్దగా పట్టించుకోని కుర్రాడు... రూమ్‌మేట్ ఒత్తిడి మరీ పెరగడంతో ఏం చేయాలో తెలియక డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు. రూమ్ అద్దె మొత్తం ఒక్కడే కట్టాల్సిందిగా, తన ఖర్చులు మొత్తం భరించాల్సిందిగా కుర్రాడిపై మానసిక ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడి పెంచాడు. రూమ్‌మేట్ బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేకపోయిన టీనేజర్... గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు అతను రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా రూమ్‌మేట్ మొబైల్‌లో చెక్ చేయగా... కుర్రాడి నగ్నచిత్రాలు కనిపించాయి. ఫోటోలు డిలీట్ చేయాల్సిందిగా వేడుకుంటూ కుర్రాడు పంపిన మెసేజ్‌లు కూడా కనిపించాయి. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
First published: May 10, 2019, 3:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading