12 ఏళ్ల చిన్నారిపై సవతి తండ్రి అత్యాచారం... బిడ్డకు జన్మనిచ్చిన బాలిక...

మొదటి భర్త చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్న మహిళ... తప్ప తాగి 12 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడిన సవితి తండ్రి... స్కూల్ టీచర్లు చెప్పేదాకా విషయం గుర్తించలేకపోయిన కన్నతల్లి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 11, 2019, 2:21 PM IST
12 ఏళ్ల చిన్నారిపై సవతి తండ్రి అత్యాచారం... బిడ్డకు జన్మనిచ్చిన బాలిక...
12 ఏళ్ల చిన్నారిపై సవతి తండ్రి అత్యాచారం... బిడ్డకు జన్మనిచ్చిన బాలిక...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 11, 2019, 2:21 PM IST
పంజాబ్ రాష్ట్రంలో దారుణం వెలుగుచూసింది. 12 ఏళ్ల బాలికపై అత్యంత అమానుషంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ సవతి తండ్రి. ఈ దారుణానికి గురైన బాలిక, గర్భం దాల్చి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీ నగరంలో వెలుగుచూసింది. మొహాలీలో ఉంటున్న ఓ మహిళ భర్త ప్రమాదంలో మరణించాడు. కొన్నాళ్లుగా ఒంటరిగా ఉన్న ఆమె, తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మొదటి భర్తకు పుట్టిన 12 ఏళ్ల కూతురు వారితోనే ఉంటోంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలో భార్య కూతురిపై కన్నేసిన సవతి తండ్రి... ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం స్కూల్ టీచర్లు గుర్తించి, చెప్పేదాకా బాలిక తల్లి గుర్తించకపోవడం విశేషం. బాలికకు స్కూల్‌లో వాంతులు కావడంతో పాటు ఆమె కడుపు అసహజంగా పెరుగుతుండడంతో అనుమానం వచ్చిన స్కూల్ యాజమాన్యం, వైద్యుడిని పిలిపించి చెకప్ చేయించారు. వైద్య పరీక్షలో టీచర్ల అనుమానం నిజమై చిన్నారి గర్భవతి అని తేలింది. వెంటనే బాలిక తల్లికి విషయం చెప్పారు టీచర్లు.

రెండో భర్త చేసిన దారుణాన్ని పసిగట్టిన చిన్నారి తల్లి... వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్కో చట్టం ప్రకారం నిందితుడిపై కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేయగా తప్పు అంగీకరించాడు. తాగిన మత్తులో ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితిలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. 12 ఏళ్ల వయసులో గర్బం దాల్చిన చిన్నారి... ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. 9 నెలల పాటు బిడ్డను కడుపులో మోసే శక్తి, సామర్థ్యాలు బాలికకు లేవని తేల్చిన వైద్యులు, ఆమెకు నెలలు నిండకుండానే డెలివరీ చేశారు. ఛండీఘర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పటిల్‌లో చిన్నారికి ప్రసవం జరగగా, ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది బాలిక. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నా, ఆమెకు పుట్టిన బిడ్డ పూర్తి ఆరోగ్యంగా జన్మనివ్వడం విశేషం. ఆ బిడ్డకు దత్తత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు బాలిక, ఆమె తల్లి.First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...